ఫగు చౌహాన్ | |
---|---|
![]() | |
20వ మేఘాలయ గవర్నరు | |
In office 2023 ఫిబ్రవరి 12 – 2024 జులై 30 | |
ముఖ్యమంత్రి | కొన్రాడ్ సంగ్మా |
అంతకు ముందు వారు | బి. డి. మిశ్రా (అదనపు ఛార్జీ) |
తరువాత వారు | సి.హెచ్. విజయశంకర్ |
28వ బీహార్ గవర్నర్ | |
In office 2019 జులై 29 -2023 ఫిబ్రవరి 12 | |
ముఖ్యమంత్రి | నితీష్ కుమార్ |
అంతకు ముందు వారు | లాల్జీ టండన్ |
తరువాత వారు | రాజేంద్ర అర్లేకర్ |
ఘోసి శాసనసభ సభ్యుడు | |
In office 2017 మార్చి – 2019 జులై | |
అంతకు ముందు వారు | Shudhakar Singh |
In office 1996 అక్టోబరు – 2012 మార్చి | |
అంతకు ముందు వారు | అచైబర్ భారతి |
తరువాత వారు | శుధాకర్ సింగ్ |
In office 1991 జూన్ – 1992 డిసెంబరు | |
అంతకు ముందు వారు | సుభాష్ |
తరువాత వారు | అచైబర్ భారతి |
In office 1985 మార్చి – 1989 నవంబరు | |
అంతకు ముందు వారు | కేదార్ |
తరువాత వారు | సుభాష్ |
నియోజకవర్గం | ఘోసి, మావు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సెఖుపూర్, యునైటెడ్ ప్రావిన్సులు, భారతదేశం | 1 జనవరి 1948
జాతీయత | భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
జీవిత భాగస్వామి | ముహారి దేవి |
సంతానం | 7 |
నివాసం | సెఖుపూర్, అజంగఢ్, ఉత్తర ప్రదేశ్ విజయంత్ ఖండ్, గోమతీనగర్, లక్నో, ఉత్తర ప్రదేశ్ |
చదువు | గ్రాడ్యేట్ |
నైపుణ్యం |
|
ఫాగు చౌహాన్ (జననం:1948 జనవరి 1) భారతీయ రాజకీయ నాయకుడు. అతను గతంలో బీహార్, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. అతను లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వంటి వివిధ పార్టీల తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఘోసీ నుండి ఉత్తర ప్రదేశ్ 17వ శాసనసభకు ఎన్నికైన మాజీ శాసనసభ సభ్యుడు, అతను రికార్డు స్థాయిలో ఆరుసార్లు శాసనసభ్యుడుగా గెలిచాడు.[1][2][3]
చౌహాన్ 1948 జనవరి 1 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అజాంగర్హ్ జిల్లాలోని శేఖ్పుర గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖర్పాట్టు చౌహాన్.
ఇతనికి ముహరి దేవితో వివాహమైంది, వీరికి ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు.[4][5]
దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చౌహాన్ 1985లో మొట్ట మొదటిసారి ఎమ్యెల్యేగా గెలుపొందాడు. 2017లో ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన అబ్బా అన్సారీపై 7003 ఓట్లతో విజయం సాధించాడు.
బీహార్ గవర్నరుగా 2019 జూలై 29 నుండి 2023 ఫిబ్రవరి13 వరకు పనిచేసాడు. ప్రస్తుతం మేఘాలయ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 18 నుండి అధికారంలో కొనసాగుచున్నారు
వ.సంఖ్య | నుండి | వరకు | పొజిషన్ | పార్టీ | మూలం |
---|---|---|---|---|---|
01 | 2019 జూలై | ప్రస్తుతం | బీహార్ రాష్ట్ర 29వ గవర్నరు | [6][7] | |
02 | 2017 మార్చి | 2019 జూలై | ఉత్తర్ ప్రదేశ్ 17వ శాసన సభ సభ్యుడు | బీజేపీ | [8] |
03 | 2007 మే | 2012 మార్చి | ఉత్తర్ ప్రదేశ్ 15వ శాసన సభ సభ్యుడు | బహుజన్ సమాజ్ పార్టీ | [9] |
04 | 2002 ఫిబ్రవరి | 2007 మే | ఉత్తర్ ప్రదేశ్ 14వ శాసన సభ సభ్యుడు | బీజేపీ | [10] |
05 | 1996 అక్టోబరు | 2002 మార్చి | ఉత్తర్ ప్రదేశ్ 13వ శాసన సభ సభ్యుడు | బీజేపీ | [11] |
06 | 1991 జూన్ | 1992 డిసెంబరు | ఉత్తర్ ప్రదేశ్ 11వ శాసన సభ సభ్యుడు | జై ప్రకాష్ జనతా దళ్ | [12] |
07 | 1985 మార్చి | 1989 నవంబరు | ఉత్తర్ ప్రదేశ్ 9వ శాసన సభ సభ్యుడు | దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ | [13] |