వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫజల్ మహమూద్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1927 ఫిబ్రవరి 18|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2005 మే 30 గుల్బర్గ్, లాహోర్, పాకిస్తాన్ | (వయసు 78)|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 3) | 1952 అక్టోబరు 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఆగస్టు 16 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1943/44–1946/47 | Northern India | |||||||||||||||||||||||||||||||||||||||
1947/58–1956/57 | Punjab (Pakistan) | |||||||||||||||||||||||||||||||||||||||
1958/59 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 మార్చి 12 |
ఫజల్ మహమూద్ (1927, ఫిబ్రవరి 18 - 2005, మే 30) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 34 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 24.70 బౌలింగ్ సగటుతో 139 వికెట్లు తీశాడు. 100 వికెట్లు దాటిన తొలి పాకిస్థానీగా రికార్డు సాధించాడు. తన 22వ మ్యాచ్‌లో మైలురాయిని చేరుకున్నాడు.
ఫజల్ ఉత్తర భారతదేశం తరపున రంజీ ట్రోఫీలో తన తొలి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ఆడాడు. దాంతో 1947-48లో ఆస్ట్రేలియాలో భారతదేశం ప్రారంభ పర్యటనకు ఎంపికయ్యాడు. పాకిస్తాన్ స్వాతంత్ర్యం తరువాత అక్కడికి వెళ్ళిపోయాడు. మొదట కొత్త దేశానికి టెస్ట్ హోదాను పొందడంలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత టెస్ట్ మ్యాచ్ జట్టుగా స్థాపించాడు. నాలుగు సందర్భాలలో ఒక టెస్టులో పది వికెట్లు తీసుకున్నాడు; భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై పాకిస్థాన్ తొలి విజయాలు సాధించింది. 1954 ఇంగ్లాండ్ పర్యటనలో ఫజల్ రెండో ఇన్నింగ్స్‌లో 6/46తో సహా 12/99తో మ్యాచ్ గణాంకాలు సాధించాడు.
కెప్టెన్‌గా అబ్దుల్ కర్దార్ తర్వాత, ఫజల్ 1959 - 1961 మధ్యకాలంలో 10 మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. 1962 ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతను టెస్ట్, ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.
ఫజల్ 2005, మే 30న గుండెపోటు తన లాహోర్ నివాసంలో మరణించాడు.[1]
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారతదేశం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి నాలుగు వేర్వేరు దేశాలతో టెస్ట్ మ్యాచ్‌లో 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి బౌలర్నిలిచాడు.[4] 22 టెస్టుల్లో 100 టెస్ట్ వికెట్లు సాధించాడు.[5]