వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫజల్‌హక్ ఫారూఖీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బగ్లాన్, ఆఫ్ఘనిస్తాన్ | 2000 సెప్టెంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 52) | 2022 జనవరి 25 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 43) | 2021 మార్చి 20 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 27 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Minister Dhaka | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–present | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | Sydney Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023-present | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2023 మార్చి 11 |
ఫజల్హాక్ ఫరూఖీ (జననం 2000 సెప్టెంబరు 22) ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం అన్ని ఫార్మాట్లలో ఆడే ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెటరు. ఫజల్‌హక్ 2021 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఫ్రాంచైజీ లీగ్‌లలో, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో ఢాకా డామినేటర్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడతాడు. [1]
ఫజల్‌హక్ 2017 నవంబరు 13న, 2017–18 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో అమో రీజియన్‌కు తన తొలి ఫస్ట్-క్లాస్ ఆడాడు.[2] అతను 2018 జూలై 10 న, 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో అమో రీజియన్ తరఫున లిస్టు A లోకి ప్రవేశించాడు.[3]
2018 సెప్టెంబరులో అతను, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] 2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. [5] అతను 2019 ష్పజీజా క్రికెట్ లీగ్‌లో బూస్టు డిఫెండర్స్ కోసం 2019 అక్టోబరు 14న ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. [6]\2019 డిసెంబరులో, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [7] 2021 ఫిబ్రవరిలో, అతను జింబాబ్వేతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [8] తరువాతి నెలలో, అతను ఆఫ్ఘనిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో, జింబాబ్వేతో జరిగిన వారి సిరీస్‌కి కూడా ఎంపికయ్యాడు. [9] 2021 మార్చి 20న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి T20I ఆడాడు.[10] అదే నెల తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం తమ జట్టులో నెట్ బౌలర్‌గా ఫజల్‌హాక్‌ను చేర్చుకుంది. [11] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్‌లో కింగ్స్ XI పంజాబ్ నెట్ బౌలర్‌గా కూడా ఫరూఖీ పనిచేశాడు. [12]
2021 జూలైలో, ఫజల్‌హక్‌ను పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులోకి తీసుకున్నారు.[13] 2022 జనవరిలో, అతను ఖతార్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు. [14] అతను 2022 జనవరి 25న ఆఫ్ఘనిస్తాన్ తరపున నెదర్లాండ్స్‌పై తన వన్‌డే రంగప్రవేశం చేసాడు. [15]
2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. [16] 2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ యొక్క మూడవ ఎడిషన్ కోసం కొలంబో స్టార్స్‌కు సంతకం చేశాడు. [17] 2022 డిసెంబరు 15న ఫజల్‌హాక్‌కి సంబంధించి, మహిళా క్రికెట్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడనే ప్రవర్తనా సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణ తర్వాత 2022 డిసెంబరు 23న, సిడ్నీ థండర్, అతనితో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. [18] [19]