ఫల్గుణి పాఠక్ | |
---|---|
జననం | [1] | 1969 మార్చి 12
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | దాండియా క్వీన్ |
వృత్తి | పాప్ సింగర్, జానపద గాయకురాలు, ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1987–ప్రస్తుతం |
ఫల్గుణి పాఠక్ (జననం 1969 మార్చి 12) భారతీయ గాయని, ప్రదర్శకురాలు, స్వరకర్త. ఆమె సంగీతం దేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ సంగీత రూపాలపై ఆధారపడింది. 1987లో అరంగేట్రం చేసిన ఆమె అప్పటి నుండి, ఇప్పటివరకు దేశవిదేశాలలో విశేష అభిమానులను కలిగిఉంది.[2] పాడటాన్ని వృత్తిగా ఎలా ఎంచుకున్నారని ఆమెను అడిగితే, అలా అనుకోకుండా జరిగిందని సమాధానమిస్తుంది.[3]
ఆమె తొలి ఆల్బమ్ 1998లో విడుదలైంది. ఆ తరువాత ఆమె బాలీవుడ్ సినిమాలలో అనేక పాటలను రికార్డ్ చేసింది. ఆమె చాలా పాటల థీమ్ ప్రేమ. ఆమె భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో తా తైయా అనే బ్యాండ్ సహకారంతో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె తారక్ మెహతా కా ఊల్టా చష్మా, కౌన్ బనేగా కరోడ్‌పతి, స్టార్ దాండియా ధూమ్, కామెడీ నైట్స్ విత్ కపిల్, బా బహూ ఔర్ బేబీ, పాండ్యా స్టోర్ వంటి టెలివిజన్ షోలలో పాల్గొన్నది.
ఆమె క్రెడిట్‌లలో కొన్ని ప్రసిద్ధ భారతీయ పాప్ సింగిల్స్ ఉన్నాయి. ఆమె ఆల్బమ్‌లు శ్రావ్యమైన పాటలకు మాత్రమే కాకుండా వాటితో చిత్రీకరించబడిన అందమైన ప్రేమకథలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఆమె గుజరాతీ కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందింది, అక్కడ ఆమె నవరాత్రి వంటి ప్రసిద్ధ పండుగలకు ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తుంది.[4]
ఆమె ఆలపించిన ప్రసిద్ధ పాటలలో మచ్చుకి కొన్ని.. చుడీ జో ఖాంకీ హాథోన్ మే, మైనే పాయల్ హై ఛంకై, మేరీ చునార్ ఉద్ద్ ఉద్ద్ జాయే, ఆయి పరదేశ్ సే పరియోం కీ రాణి, సావాన్ మే వంటివి చెప్పుకోవచ్చు.
ఆగస్టు 2013లో, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆమె రూ.2 కోట్లు సంపాదిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రదర్శన ఇచ్చిన ప్రతిరోజు ఆమె పారితోషికం సుమారు రూ.70 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే నిర్వాహకులు స్పాన్సర్‌లను ఆకర్షించడం కోసం ఇలా వైరల్ చేసే అవకాశం లేకపోలేదు.[5]
{{cite web}}
: Check |url=
value (help)