వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫాతిమా సనా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 2001 నవంబరు 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 79) | 2019 6 మే - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 11 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 43) | 2019 15 మే - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 3 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | కరాచీ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | జరై తారకియాతి బ్యాంక్ లి.మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | బార్బడోస్ రాయల్స్ (WCPL) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 21 ఫిబ్రవరి 2023 |
ఫాతిమా సనా (జననం 8 నవంబరు 2001) ఒక పాకిస్తానీ క్రికెటర్, కుడిచేతి మీడియం - ఫాస్ట్ బౌలర్ [1]. ఆమె ప్రధానంగా పాకిస్తాన్ తరపున ఆడుతుంది. కరాచీ జరాయ్ తారాకియాటి బ్యాంక్ లిమిటెడ్ ఇంకా బార్బడోస్ రాయల్స్ [2] తరపున దేశీయ క్రికెట్ ఆడింది. 2019 దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టులో ఆమె ఎంపికైంది.[3] 6 మే 2019న దక్షిణాఫ్రికా జరిగిన మహిళా ఒక రోజు అంతర్జాతీయ (డబ్ల్యూఓడిఐ) మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున మొదటిసారిగా ఆడింది.[4] మహిళా ట్వంటీ 20 అంతర్జాతీయ (టి20ఐ) మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున 15 మే 2019న దక్షిణాఫ్రికాతో తలపడింది.[5] జనవరి 2020లో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఆమె ఎంపికైంది[6]. అదే సంవత్సరం 2డిసెంబరు లో పిసిబి అవార్డులకు 'ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికయ్యారు.[7]
జూన్ 2021లో వెస్టిండీస్ లో పర్యటించిన పాకిస్తాన్ జట్టులో సనా కూడా ఉంది.[8] పర్యటన ఆఖరి మ్యాచ్ లో ఫాతిమా[9] 5/39 తో WODI లో తన మొదటి ఐదు వికెట్లను తీసింది.[10] అక్టోబరు 2021లో జింబాబ్వేలో జరిగిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది.[11] జనవరి 2022లో న్యూజిలాండ్లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది.[12] అదే సంవత్సరం మే లో ఇంగ్లాండ్, బర్మింగ్హామ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది. టోర్నమెంట్లో ఆమె పాకిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[13] ఆగస్ట్ లో మహిళా కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆమె బార్బడోస్ రాయల్స్ విదేశీ క్రీడాకారిణిగా సంతకం చేసింది.[14]