ఫిన్లాండ్లోహిందూమతం చాలా చిన్న మతం. ఇక్కడ 5000 [1] నుండి 6000 [2] మంది హిందువులు ఉన్నారు. వీరిలో అత్యధికులు భారతదేశం, నేపాల్, శ్రీలంకకు చెందినవారు. నోకియా వంటి కంపెనీలు భారతదేశం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల ఫిన్లాండ్‌లో 21వ శతాబ్దం ప్రారంభంలో మొదటిసారిగా గణనీయమైన హిందూ జనాభా వచ్చింది.
2009లో, ఫిన్లాండ్‌లోని హిందూ నాయకులు కియాస్మా మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్‌లోని ప్రదర్శనలో "హిందూమతాన్ని కించపరిచే" ఫోటోను చేర్చడాన్ని నిరసించారు. [5] ఆ తరువాత మ్యూజియం ఆ ఫోటోలో హిందూ మతానికి సంబంధించిన సూచనను తొలగించింది. [6]
యోగా అనేక రకాలుగా విరాజిల్లుతోంది. 80 శాతం మంది స్థానిక ఫిన్‌లు సభ్యులుగా గల ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, యోగాను పదివేల మంది అభ్యసిస్తున్నారని నివేదించింది. [7]