ఫిష్ వెంకట్ | |
![]() | |
జన్మ నామం | మంగిలంపల్లి వెంకటేశ్ |
జననం | ![]() |
ప్రముఖ పాత్రలు | ఆది బన్ని కింగ్ |
ఫిష్ వెంకట్ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా హాస్య ప్రధాన, సహాయ పాత్రలు వేస్తుంటాడు.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు వి.వి.వినాయక్ ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.
ఇతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్ళి చేసేశారు. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో ప్రతినాయక్ పాత్రలు చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. మూడవ కుమారుడు ప్రాథమిక విద్య చదువుతున్నాడు.
సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2002 | ఆది (సినిమా) | |||
2005 | భగీరథ | |||
బన్ని | ||||
2006 | సామాన్యుడు | |||
2008 | కింగ్ | |||
హీరో | ||||
శౌర్యం | ||||
రెడీ | ||||
కాళిదాసు (2008 సినిమా) | ||||
పౌరుడు | ||||
2009 | శంఖం (సినిమా) | |||
గణేష్ | ||||
2010 | డాన్ శీను | |||
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం | ||||
పప్పు (సినిమా) | ||||
వరుడు | ||||
సీతారాముల కళ్యాణం లంకలో | ||||
అదుర్స్ | ||||
2011 | మిరపకాయ్ | |||
వీర | ||||
కందిరీగ (సినిమా) | చింటు | |||
వీడు తేడా | ||||
సోలో | ||||
2012 | దరువు | ఫిష్ ఫిష్ వెంకట్ | ||
సుడిగాడు | వెంకట్ | |||
గబ్బర్ సింగ్ | ||||
2013 | నాయక్ (సినిమా) | |||
జై శ్రీరామ్[1] | ||||
అడ్డా[2] | ||||
రేస్ | ||||
2014 | జోరు[3] | |||
జంప్ జిలాని | ||||
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో | ||||
2015 | సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | |||
భమ్ బోలేనాథ్[4] | ||||
మోసగాళ్లకు మోసగాడు | ||||
2016 | సుప్రీమ్ | పోలీసు అధికారి | ||
బాబు బంగారం | ||||
2017 | రాధ | |||
2018 | కన్నుల్లో నీ రూపమే | |||
2018 | ఇష్టంగా | |||
2019 | బుర్రకథ | |||
2020 | మా వింత గాధ వినుమా | తెలుగు | ||
2020 | గువ్వ గోరింక | తెలుగు | ||
2020 | బొంభాట్ | తెలుగు | ||
2022 | డీజే టిల్లు | హెడ్ కానిస్టేబుల్ | తెలుగు | |
సురాపానం | తెలుగు | |||
సూపర్ మచ్చి | తెలుగు | |||
ఎస్5 నో ఎగ్జిట్ | తెలుగు | |||
2023 | లింగోచ్చా | తెలుగు | ||
2025 | కాఫీ విత్ ఏ కిల్లర్ | తెలుగు |