ఫుటాలా సరస్సు | |
---|---|
ప్రదేశం | నాగపూర్, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 21°09′14″N 79°02′31″E / 21.154°N 79.042°E |
ఉపరితల వైశాల్యం | 60 ఎకరాలు (24 హె.) |
ఫుటాలా సరస్సు భారతదేశంలోని మహారాష్ట్రలో గల నాగపూర్‌లో ఉంది. ఈ సరస్సు 60 ఎకరాల (24 హెక్టార్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నాగపూర్‌లోని భోంస్లే రాజులు నిర్మించిన ఈ సరస్సు రంగు రంగుల ఫౌంటైన్‌లకు ప్రసిద్ధి చెందింది. సాయంత్రాలలో సైట్ హాలోజన్ లైట్లు, టాంగా (క్యారేజ్) రైడ్‌లతో ప్రకాశిస్తుంది. సరస్సు చుట్టూ మూడు వైపులా అడవి, నాల్గవ వైపు ల్యాండ్‌స్కేప్డ్ బీచ్ ఉన్నాయి.[1]
నాగపూర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ ఫుటాలా సరస్సు 200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పూర్వం ఈ సరస్సును కేవలం పశువులను కడగడానికి మాత్రమే పరిమితం చేయబడి ఉండేది. అందువల్ల 2003 లో ఈ సరస్సును NIT నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం వంటి వాటి నుండి అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.[2]
ఫుటాలా సరస్సు సుందరీకరణ కార్యక్రమాలు రెండు దశల వారీగా జరిగాయి.[3]
సరస్సులోని తామర మొక్కలను, చెత్తను తొలగించడంతో పాటు పెద్ద ఎత్తున డీసిల్టింగ్ చేశారు. సరస్సు తూర్పు గోడను గ్రానైట్ రాతితో మరమ్మతు చేశారు. ఐఆర్‌డిపి కింద 18 మీటర్ల వెడల్పుతో రహదారిని విస్తరించడం, రోడ్‌సైడ్ గార్డ్ వాల్, ల్యాండ్‌స్కేపింగ్ బెర్మ్‌లు, పార్కింగ్, రహదారికి అవతలి వైపు ఉన్న తోటలు, అలంకరణ దీపాలు, బెంచీలు, ఆకర్షణీయమైన డస్ట్ బిన్‌లు మొదలైనవి ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరు పెట్టడం కోసం, ల్యాండ్‌స్కేపింగ్ కోసం, స్ప్రింక్లర్ వ్యవస్థను వాడారు. సరస్సుకు దక్షిణాన మూడు ర్యాంపులతో నిమజ్జన ఘాట్, ఉత్తరం వైపు ఇసుక బీచ్ ఏర్పాటు చేశారు.
సుందరీకరణ రెండవ దశలో, రహదారి బెర్మ్‌లు శుభ్రం చేయడం, హనుమాన్ దేవాలయం నుండి ఫుటాలా సరస్సు వరకు ఉన్న త్రికోణాకార రహదారిపై ఇంటర్‌లాకింగ్ పేవింగ్ బ్లాక్‌లు ఏర్పాటు చేయడం, పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి దాదాపు 1300 మీటర్ల రోడ్డు వేయడం జరిగింది.
రెండు దశల్లో పునరుద్ధరణ కార్యక్రమాలకు చేపట్టిన ప్రాజెక్ట్ ఖర్చు సుమారు 45,000,000. అభివృద్ధి తర్వాత ఈ ప్రాంతం నాగపూర్ నగరంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. సగటున, ప్రతిరోజూ 1,000 మంది సందర్శకులు సరస్సును సందర్శిస్తారు.[4]
ఫుటాలా సరస్సులో అధిక భాగం వాటర్ హైసింత్, వాటర్ లిల్లీ, హైడ్రిల్లా, వోల్ఫియా, పొటామోగెటన్, ఆల్గే వంటి మొక్కలు పెరుగుతాయి.[5]
నాగ్‌పూర్‌లో మరో పది పెద్ద సరస్సులు ఉన్నాయి:[6]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)
{{cite web}}
: Check date values in: |date=
(help)CS1 maint: bot: original URL status unknown (link)