ఫుటోమని (Futomani (太占)) షింటో సంప్రదాయంలోని భవిష్యవాణి వ్యవస్థ. ఈ విధానంలో అభ్యాసకులు మొగ జింక రెక్క ఎముక ను వేడి చేస్తే ఏర్పడే పగుళ్ళ నమూనాను చూసి భవిష్యత్ సంఘటనలను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు.[1] ఈ విధానం, చైనా నుండి దిగుమతి చేసు కున్న తాబేలు చిప్ప తో భవిష్యవాణి ని చెప్పే విధానం కంటే ముందే ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. పురాతత్వ ఆధారాలు ఈ అభ్యాసం జోమోన్ కాలం నాటికే వాడుకలో ఉన్నట్లు సూచిస్తున్నాయి.[2]సాధారణంగా యురేనివా నో కామి ని, ఈ ఫుటోమనికి సంబంధించిన కామి గా పేర్కొంటారు. [3] ఇప్పటికీ మౌంట్ మిటేక్ పైన షింటో పుణ్యక్షేత్రంలో, ఈ ఫుటోమని ని వార్షిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. [4] ఆయికిడో లో, ఫుటోమని ని కోటోడమ అభ్యాసంలో సమ్మిళితమై ఉన్న ఒక ముఖ్య అంశంగానే భావిస్తారు. [1] [5] [6]