ఫుల్కారీ (పంజాబీ: ਫੁਲਕਾਰੀ) పంజాబ్ ప్రాంతం లోని ఎంబ్రాయిడరీ పని. ఇది భారతదేశం, పాకిస్తాన్ లలోని పంజాబీ ప్రాంతంలో ఉన్న ఎంబ్రాయిడరీ కళ. ఫుల్కారీ అనే పదానికి "పూల పని" అని అర్థం. ఈ పదం ఒకానొక సమయంలో ఎంబ్రాయిడరీగా ఉపయోగించారు. కానీ ఈ ఫుల్కారీ పదం ఎంబ్రాయిడరీ షాలువాలు, తల స్కార్ఫ్ లకు వాడడాన్ని నిరోధించబడింది. ప్రతీరోజూ తయారవుతున్న సరళంగా, అక్కడక్కడా ఎంబ్రాయిడర్ చేయబడిన ఒడిని (తల స్కార్ఫ్), దుపట్టా, శాలువాలను ఫుల్కారీలు అంటారు. ఈ వస్త్రాలలో ప్రత్యేక సందర్భాలలో అనగా వివాహాలు లేదా కుమారుని పుట్టినరోజు కార్యక్రమాలకోసం పూర్తిగా కప్పబడినవాటిని బాగ్స్ (గార్డెన్) అనీ, చెల్లాచెరురుగా ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండే దానికి "ఆధాబాఘ్" అని అంతారు. ఈ మొత్తం పని తెలుపు లేదా పసుపు పట్టు ముడులు కాటన్ ఖద్దరుపై వేస్తారు. దీనిని వస్త్రం మధ్య నుండి ప్రారంభిస్తే దానిని "చాష్మ్-ఎ-బల్బుల్" అని అంటారు. ఇది పూర్తి వస్త్రం అంతా విస్తరింపబడి ఉంటుంది.
ఫుల్కారీ అను పదంలో "ఫుల్" అనగా పూవ్వు అనీ, "కారీ" అనగా కళ అని అర్థం. పదం యొక్క అర్థం ప్రకారం దీనిని "ప్లోరల్ క్రాఫ్ట్" (పూల కళ) అని అంటారు.
పంజాబ్ అనునది ఫుల్కారీ కళకు ప్రసిద్ధి చెందినది. ఈ ఎంబ్రాయిడరీ పట్టు దారంతో కాటన్ దారంతో వేయబడుతుంది. వస్త్రంపై సాధారణంగా జ్యామితీయ నమూనాలతో ఫుల్కాలు వేయబడి ఉంటాయి. పంజాబ్ లోని వివాహాలు, యితర ఉత్సవాలలో మహిళలు ఈ ఫుల్కారీలు, బాగ్ల్ ను ధరిస్తారు. ఈ ఫుల్కారీలను మహిళలు తమకోసం లేదా వారి కుటుంబ సభ్యుల కోసం ఎంబ్రాయిడరీ చేసి తయారుచేస్తారు కాని అమ్మకానికి కాదు. అందువల్ల ఇది పూర్తిగా గృహసంబంధమైన దేశీయ కళ. ఇది వారి అంతర్గత కోరికలను సంతృప్తి పరచడానికే కాకుండా రోజువారీ జీవితంలో రంగులను తెస్తుంది. ఒక విధంగా, అది నిజమైన జానపద కళ. వివాహాల సందర్భంలో ఫుల్కారీలు, బాగ్లు వధువులకు అందజేసే సాంప్రదాయం పంజాబీలకు ఉంది. పంజాబ్ ప్రాంతంలోని హజారా, పేష్వార్, సియాల్‌కోట్, ఝెలం, రావల్పిండి, కుల్తాన్, అమృత్ సర్, జలంధర్, అంబాలా, లూధియానా, నాభా, జింధ్, ఫరీద్‌కోట్, కాపుర్తల, చాక్వాల్ జిల్లాలలో ఈ బాగ్ల ఎంబ్రాయిడారీ ప్రసిద్ధి చెందింది.[1] ఈ బాగ్, ఫుల్కారీ కళ గుజరాత్ కు కూడా విస్తరించింది. అచ్చట ఇవి "హీర్ భారత్"గా పిలువబడి జ్యామితీయ అలంకారాలు, కుట్టుపనితో ఉపయోగించబడుతున్నవి.[2] కొంతమంది ఈ కళ మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చి పంజాబ్, హర్యానా, గుజరాత్ లలో స్థిరపడిన జాట్ తెగల నుండి చేరినట్లు చెబుతారు. వేదాలలోను, మహాభారతం, గురుగ్రంథ సాహిం, పంజాబ్ యొక్క జానపద కళలలో ఫుల్కారీ కళకు మూలాలున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫుల్కారీ ఎంబ్రాయిడరీ కళ 15 వ శతాబ్దం నుండి ప్రాచుర్యంలోని వచ్చింది.[3] ముతక కాటన్ వస్త్రం యొక్క రెండవవైపు రంగురంగుల సిల్కు దారాలతో ఎంబ్రాయిడరీ చేయబడుట దీని ప్రధాన లక్షణం. పంజాబీ మహిళకు అసంఖ్యాకమైన ఆకట్టుకునే విధంగా అనేక ఆకర్షణీయమైన డిజైన్లను, పాటర్న్ లను నైపుణ్యంతో కుడతారు. మూలంగా ఉన్న ఖద్దరు వస్త్రం పశ్చిమ పంజాబ్ లోనూ మధ్య పంజాబ్ కంటే నాణ్యతగా ఉండే విధంగా ఉంటుంది. పశ్చిమ పంజాబ్ లో నలుపు/నీలం రంగులను వాడడానికి యిష్టపడరు. తూర్పు పంజాబ్ ప్రాంతంలో తెలుగు రంగును వాడరు. పశ్చిమ పంజాబ్ లో 2 లేదా 3 ముక్కలు వస్త్రాన్ని మొదట మడత పెట్టి కలుపుతారు. తూర్పు పంజాబ్ లో మొదట వస్త్రాలను కలిపి కుట్టి తరువాత ఎంబ్రాయిడరీ చేస్తారు.
వివాహాలలో వధువులు రెండు రకాల శైలులలో చోప్ మర్యు సుభార్ లను ధరిస్తారు. ఛోప్ అనేది వస్త్రానికి రెండువైపుల వేసిన ఎంబ్రాయిడరీ. దాని నాలుగు వైపుల బోర్డర్లు, మూలలు చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తారు.[4] సుభార్ అనేది మధ్య మోతిఫ్, నాలుగు మూలలలో మోతిఫ్ లు కలిగి ఉంటుంది.[5]
టిల్ పత్రా అనేది అలంకరింపబడిన ఎంబ్రాయిడరీ పని. దీనిపై నువ్వులు జల్లేటట్లుగా అలంకరణ ఉంటుంది.[4] టిల్ పత్రా అనే పదానికి అర్థం "విత్తనాలను వెదజల్లుట" .[6]
నీలక్ ఫుల్కారీ నలుపు లేదా ఎరుపు బ్యాక్ గ్రౌండ్ తో తయారుచేయబడి దానిపై పసుపు లేదా కాంతివంతమైన ఎరుపు ఎంబ్రాయడరీ చేయబడి ఉంటుంది. ఈ ఫుల్కారీ రంగు కొన్ని లోహాలతో కలిసి ఉంటుండి[4]
రావల్పిండి మూలంగా ఈ గూంగట్ బాగ్ తయారుచేయబడుతుంది. దీనిపై మూలలో మధ్య భాగం బాగా ఎంబ్రాయిడరీ చేయబడి తలపై ధరించడానికోసం తయారుచేయబడుతుంది. ఈ ఎంబ్రాయిడరీ మధ్య భాగం ముఖంపైకి లాగబడి ఉంటుంది.[4]
రోహితక్, గుర్గావ్, హిస్సార్, ఢిల్లీలలో ఈ చర్మాస్ ఫుల్కారీ ధరిస్తారు. వస్త్రంపై పసుపు, గ్రే, నీలం దారాలలో చిన్న అద్దాలతో కూడుకొని ఎంబ్రాయిడరీ చేస్తారు.[4]
పంజాబ్ ప్రాంతంలోని నైరుతి, దక్షిణ ప్రాతాలలో వస్త్రం మూలలలో జంతువులు, పక్షులు ఎంబ్రాయిడరీ చేయబడి ఉండే విధంగా తయారుచేస్తారు. చాప్ తయారీలో అంచులకు రెండు వైపులా ఎంబ్రాయిడరీ చేసే విధంగా తయారుచేస్తారు.[4] ఈ వస్త్రాలు పంజాబ్ ప్రాంతంలోని దక్షిణ, నైఋతి ప్రాంతాలలోనూ పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్ లోనూ ఉపయోగిస్తారు.
ఈ ఫుల్కారీ ఫిరోజ్ పూర్ చుట్టుపక్కల ఉంటుంది. ఈ ఫుల్కారీలో పక్షులు, ఆభరణాలు (ముఖ్యంగా బ్రాస్ లైట్, రింగులు, నెక్లస్) తో కూడుకొని ఉంటుంది.[4]