ఫేమస్ లవర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | కె. బాలకృష్ణన్ |
రచన | మోనా పళనిసామి కె. బాలకృష్ణన్ |
నిర్మాత | కె. గురునాథన్ పి. ఈలప్పన్ ఎం. ధర్మరాజన్ బాలకృష్ణన్ కె |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సి. ప్రేమ్ కుమార్ |
కూర్పు | రాజ మొహమ్మద్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వల్లీ స్టూడియో[1] |
పంపిణీదార్లు | జె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్ |
విడుదల తేదీ | 31 జనవరి 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఫేమస్ లవర్ 2014లో విడుదల అయిన తెలుగు సినిమా. శ్రీ వల్లీ స్టూడియో బ్యానర్ పై కె. గురునాథన్ నిర్మించిన ఈ చిత్రానికి కె. బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా తమిళ "రమ్మీ" కి అనువాదం.
సత్య శ్రీకాకుళంలోని కాలేజీలో చదువుతుంటాడు. అక్కడ జోసెఫ్ పరిచయం అవుతాడు. వాళ్లు ఒకే రూమ్ లో ఉండి చదువుకుంటారు. సత్య అదే కాలేజీలో చదివే మీనాక్షితో ప్రేమలో పడతాడు. ఆమె ఆ గ్రామ సర్పంచ్ తమ్ముని కూతురు. ఆ గ్రామ సర్పంచ్ కి కుల పిచ్చి ఎక్కువ. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని చంపేస్తాడు. మీనాక్షి తన తండ్రికి తన ప్రేమ గురించి తెలిస్తే సత్యని చంపేస్తాడని భయపడుతుంది. సత్య, జోసెఫ్ మరొక క్లాస్‌మేట్‌తో గొడవ కారణంగా కళాశాల హాస్టల్ నుండి బహిష్కరించడి మీనాక్షి గ్రామానికి వచ్చి ఉంటారు. జోసెఫ్ అదే ఊళ్ళో ఉండే స్వర్ణని ప్రేమిస్తాడు. స్వర్ణ మీనాక్షికి అక్క అని తెలుసుకుంటాడు. స్వర్ణ తండ్రి స్వర్ణ ప్రేమ గురుంచి తెలిసి జోసెఫ్ ని చంపాలనుకుంటాడు. స్వర్ణ, జోసెఫ్ ఊరు నుండి వెళ్ళిపోయి పెళ్లిచేసుకుంటారు. స్వర్ణ తండ్రి అనుచరులు జోసెఫ్ ని చంపేసి స్వర్ణని ఇంటికి తీసుక వస్తారు. ఇంట్లో ఒక గదిలో స్వర్ణని బంధిస్తారు. మీనాక్షి ప్రేమ కూడా ఇంట్లో తెలిసి సత్యని చంపాలనుకుంటారు. స్వర్ణ తన తండ్రిని చంపి సత్య, మీనాక్షిలను కలుపుతుంది.[3]