ఫ్లక్సుకోర్డు వెల్దింగు విధానము కూడా మెటల్ ఆర్కువెల్డింగుప్రక్రియ వంటిదే.ఇందులో కూడా ఆర్కుద్వారా అతుకవలసిన లోహాభాగాలను కరగించి, ద్రవీకరణచెందిన లోహాణువులను ఏకీకృతముగా స మ్మేళన మొందునట్లుచేసి, లోహాలను అతుకు ప్రక్రియ.ఈ వెల్డింగుప్రక్రియ సా.శ.1950లో అభివృద్ధిపరచబడి వాడుకలోనికి తీసుకురాబడింది.ఈ వెల్డింగువిధానంలో వెల్డింగునకు ఉపయోగించు ఎలక్ట్రోడు కడ్డి, షీల్డెడు మెటల్ ఆర్కు వెల్డింగు (SMAW) లో వాడు ఎలక్ట్రోడువలె ఘనం (solid) కాకుండగా, ఎలక్ట్రోడులోహంతోచెయ్యబడి, సన్ననిగొట్టము (tube) వలె వుండి, గొట్టములోపల స్రావకము నింపబడివుండును.ఫ్లక్సుకోర్డు అర్కు వెల్డింగులో అవసరాన్నిబట్టి షిల్డింగు వాయువునుకూడా వినియోగిస్తారు (GMAWలో వాడినట్లుగా).అందుచే ఈవెల్డింగు విధానాన్ని షిల్డెడు మెటల్ ఆర్కు వెల్డింగు, గ్యాసు మెటల్ ఆర్కు వెల్డింగు రెండింటి లక్షణాలు కలిగిన వెల్డింగు విధానము.[1]
షీల్డుమెటల్ ఆర్కువెల్డింగుకన్న ఎంతోమెరుగైన వెల్డింగుప్రక్రియ ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు.మెటల్ ఆర్కువెల్డింగులో తరచుగా వెల్డింగుఎలక్ట్రోడును మార్చుచుండవలెను.స్రావకపూతకలిగిన ఎలక్ట్రోడులు 250 నుండి450 మి.మీ.పొడవు మాత్రమే వుండటంవలన ఒకఎలక్ట్రోడు అయ్యినతరువాత మరో వెల్డింగుఎలక్ట్రోడును వెల్డింగుహోల్డరుకు బిగించవలసి వుండును.అందువలన వెల్డింగును చేయుటలో కొంత అంతరాయము వచ్చును. అంతియేకాకుండ షిల్డెడుఎలక్ట్రొడుతో ఎలక్ట్రొడుపూర్తిగా అయ్యెవరకు వెల్డింగుచేయుటకు వీలుండదు.వెల్డింగుసమయంలో ఎలక్ట్రోడులో అధికమొత్తములో విద్యుత్తు అవేశిత ఎలక్ట్రానుల ప్రవాహంవలన తొందరగానే ఎలక్ట్రొడు వేడెక్కి, ఎర్రగామారును.అందుచే కొంతమేర వెల్డింగుచేసిన తరువాత అగి మళ్లివెల్డింగును కొనసాగించవలసివున్నది.అందువల షీల్డెడుమెటల్ ఎలక్ట్రొడు నుపయోగించి నిరంతరముగా (continuously) వెల్దింగుచేయుటకు కుదరదు.
షిల్డెడుమెటల్ ఆర్కువెల్డింగులో ఎలక్ట్రోడు కొంతమేర వృధాఅవుతుంది.ఎలక్ట్రొడుహోల్డరులో 25 మి.మీ, వరకు ఎలక్ట్రొడుమిగిలిపోతుంది.అంతియేకాకుండగా ఎలక్ట్రోడుపూర్తిగా అయ్యెవరకు వెల్డింగుచెయ్యటానికి కుదరదు. ఎలక్ట్రోడు కరుగుతూ పొడవు తగ్గటంవలన, ఆర్కుకు సమీపముకు హోల్డరు వెళ్లడంవలన హోల్డరు, చేతితొడుగు వెడెక్కును.అందుచే వెల్డింగుచెయ్యడం కష్టమవుతుంది.అందువలన ప్రతిఎలక్ట్రొడులో దాదాపు40-50 మి.మీ.వెల్డింగు ఎలక్ట్రొడుమెటల్ ఆర్కువెల్డింగులో వృధాఅవుతుంది.ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగులో ఎలక్ట్రోడు వృధాకాదు.ఫ్లక్సుకోర్డు వెల్డింగులో ఫ్లక్సుకోర్డుఎలక్ట్రోడు ఒకచక్రంవంటిదానికి చుట్టబడి, వెల్డింగుసమయములో వెల్డింగుకు అనుగుణంగా ఫిడరు రోలరులద్వారా ఎలక్ట్రొడుముందుకు విరంతరం వెల్డింగును ఆపువరకు కదులుచుండును.