ఫ్లాష్ బట్ వెక్డింగు (Flash Butt welding) అను ప్రక్రియ రెండు లోహంలను అతుకు విధానం.సరిగ్గా నిర్వచించినచో ఒకేరకమైన రెండు లోహభాగంలను అతుకు ప్రక్రియం.లోహాంలను అతుకు ఈ ప్రక్రియ లోహంల కున్న వాటి ప్రత్యేకమైన ఒక గుణాన్ని ఆధారం చేసుకొని పనిచేయును.లోహంలన్నియు విద్యుత్తు వాహకంలైనప్పటికి, అన్నియు ఒకే రకమైన విద్యుత్తు ప్రవాహక లక్షణాన్ని చూపించవు.అన్నిలోహంలు కొంతమేర విద్యుత్తు నిరోధక తత్వాన్ని చూపించును.ముఖ్యంగా వాహకంలో ప్రవహించు విద్యుచ్ఛక్తి యొక్క విద్యుచ్ఛాలక శక్తి పెరిగే కొలది, వాహక లోహంయొక్క మందం (వ్యాసం) తగ్గెకొలది, వాహకంయొక్క పొడవు పెరిగే కొలది ఈ విద్యుత్తు వాహక నిరోధం విలువ పెరుగుతుంది.
ఫ్లాష్ బట్ వెల్డింగు పనిచేయు విధానంలో బట్ లేదా అప్‌సెట్ వెల్డింగు వంటిదే.నిజం చెప్పాలంటే బట్ వెల్డింగునుండే ఫ్లాష్ బట్ వెల్డింగ్ పరిణితి/అభివృద్ధ్ చెందినది అనిచెప్పవచ్చును. ఫ్లాష్ బట్ వెల్డింగులో కూడా విద్యుత్తు ప్రవాహం (current flow), వత్తిడి (pressure) రెండింటిని ఉపయోగ్స్తారు.బట్ (అప్‌సెట్) వెల్డింగులో మొదట వత్తిడిని కలిగించి ఆతరువాత విద్యుత్తు ప్రవాహాన్ని కలుగచేసి, వేడిని పుట్టించి, లోహాలను కరగించి అతికెదరు.ఫ్లాష్ బట్ వెల్డింగు విధానం లేదా ప్రక్రియలో మొదట అతుకవలసిన రెండు లోహ అంచులు/చివరల లలో విద్యుత్తును ప్రవహింపచేసి, అంచులవద్ద ఎలక్ట్రానుల ప్రవాహ వత్తిడివలన క్షణికదీప్తి/క్షణప్రభ (flash) ఏర్పడటం వలన లోహాలను వేడిచేసి, అంచులు/చివరలపై ఇప్పుడు వత్తిడిని ఉపయోగించి లోహంలను అతికెదరు. [1]
ప్లాష్ బట్ వెల్డింగు యంత్రాలలో పలురకాలున్నాయి.మనిషి పర్యవేక్షణ (manually operated) లో పనిచేయునవి, మనిషి పర్యవేక్షణ లేకుండ స్వయం పనిచేయు (automated) రకాలు, కంప్యూటరు నియంత్రణ (PLC) రకాలున్నాయి.