బండ్ల గణేష్ | |
---|---|
జననం | షాద్‌నగర్, మహబూబ్ నగర్ జిల్లా |
వృత్తి | నటుడు, నిర్మాత |
బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు. 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు.ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[1]
2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] కానీ టికెట్ దక్కలేదు.[3] ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.[4]
గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత వక్కంతం వంశీ ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి ఆరు నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.[8]