బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (Bajaj Electricals Ltd) వినియోగదారుల ఎలక్ట్రికల్ పరికరాల తయారుచేసే కంపెనీ. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 1938 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. కంపెనీ వ్యాపార విభాగాలలో లైటింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్; ఇంజినీరింగ్ & ప్రాజెక్ట్స్, ఇతర పరికరాలు ఉన్నాయి.[1] బజాజ్ గ్రూప్లో ఈ కంపెనీ ఒక అనుబంధ సంస్థ.
దస్త్రం:Bajaj Electricals logo.svg | |
బి.ఎస్.ఇ: 500031 | |
పరిశ్రమ | మెకానికల్ ఫ్యాన్ |
స్థాపన | 14 జూలై 1938 |
స్థాపకుడు | కమలనయన్ బజాజ్ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | శేఖర్ బజాజ్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్,[3] Late అనంత్ బజాజ్, |
ఉత్పత్తులు | గృహ అవసరాలు, ఫ్యాన్లు, లైటింగ్ & ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్ [5] |
రెవెన్యూ | ₹27.7 బిలియను (US$350 million) (2011)[6] |
మాతృ సంస్థ | బజాజ్ గ్రూప్ |
అనుబంధ సంస్థలు | స్టార్ లైట్ లైటింగ్ |
వెబ్‌సైట్ | www |
బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 1938 సంవత్సరంలో రేడియో ల్యాంప్ వర్క్స్ గా స్థాపించబడింది తర్వాత 1960 సంవత్సరంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ గా పేరు మార్చబడింది[7]. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వినియోగదారులకు సేవలను అందిస్తున్న కంపెనీ. భారతదేశంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, నిర్మాణ రంగాల వ్యాపారాలలో నిమగ్నమై ఉన్న వ్యాపారసంస్థ. బజాజ్ఎలక్ట్రికల్స్ ఇంజినీరింగ్ & ప్రాజెక్ట్స్, ఇతర విభాగాలలో . టోస్టర్లు, మిక్సర్-గ్రైండర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, జ్యూసర్ మిక్సర్ గ్రైండర్లు, చాపర్లు, హ్యాండ్ బ్లెండర్లు, స్నాక్ మేకర్, వెట్ గ్రైండర్లు, ఓవెన్ టోస్టర్ గ్రిల్, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, ఇండక్షన్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, ప్రెజర్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్ లు, నాన్ ఎలక్ట్రిక్ కిచెన్ ఉపకరణాలు ఉన్నాయి. ఇస్త్రీ పెట్టలు (ఐరన్ బాక్స్) స్టోరేజీ వాటర్ హీటర్లు, పాన్, టావాస్, గ్యాస్ వాటర్ హీటర్లు,, రూమ్ హీటర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కూలర్లు సహా వివిధ రకాల ఉపకరణాల వంటివి తయారు చేస్తుంది. గృహ వినియోగదారులకు సీలింగ్, పెడస్టల్, టేబుల్, వాల్, పర్సనల్, డొమెస్టిక్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ సర్క్యులేటర్లతో కూడిన వివిధ ఫ్యాన్లను చేయడం, కంపెనీ లైటింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యాక్ససరీలను అందిస్తుంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ, ప్రసార ప్రాజెక్టుల రూపకల్పన, ఇంజనీరింగ్, సరఫరా, అమలు, కమిషనింగ్, పవన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు భారతదేశంలో సుమారు 2,18,000 రిటైల్ అవుట్ లెట్ ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తన ఉత్పత్తులను శ్రీలంక, బంగ్లాదేశ్, సింగపూర్, మయన్మార్, మారిషస్, నైజీరియా, ఇథియోపియా, ఉగాండా, ఘనా, టాంజానియా, మడగాస్కర్, కెన్యా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.[8]
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడం కొరకు వివిధ దేశాలతో పేరున్న బ్రాండ్ లతో భాగస్వామ్యంతో సంస్థ ఉంది. భాగస్వామ్యం ఉన్న సంస్థలలో లుమినైర్స్ కోసం స్విట్జర్లాండ్ కు చెందిన సెక్యూరిటన్, ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ కొరకు కెనడా డెల్టా కంట్రోల్స్, వైర్డ్, వైర్ లెస్ సెన్సార్ ల కొరకు గ్రేస్టోన్ ఆఫ్ కెనడా, మాగ్నమ్ ఎనర్జీ ఫర్ యుఎస్ఎ, ఫ్యాన్స్ కొరకు యూఎస్ఎ, మిడియా ఆఫ్ చైనా, అప్లయన్సెస్ కొరకు బ్రిటన్ కు చెందిన మార్ఫీ రిచర్డ్స్ లతో బిఇఎల్ మార్కెటింగ్ ఏర్పాట్లను కలిగి ఉంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎనర్జీ సేవింగ్ ల్యాంప్స్ (సిఎఫ్ఎల్) తయారీ కోసం స్టార్లైట్ లైటింగ్లో కూడా పెట్టుబడులు పెట్టింది[9].
బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 1938 జూలై 14న స్థాపించబడిన ఒక లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా వర్గీకరించబడింది. సంస్థ అధీకృత షేర్ క్యాపిటల్ రూ. 40.00 కోట్లు, మొత్తం పెయిడ్-అప్ క్యాపిటల్ రూ. 22.98 కోట్లు. 2021 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రెవెన్యూ సుమారు రూ. 500 కోట్లకు పైగా ఉంది.[10]
బజాజ్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ వినియోగదారులకు అందిస్తున్న సేవలను, సంస్థ నాయకత్వమునకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను, గుర్తింపు పొందినది.[11]