రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | Conglomerate |
స్థాపన | 1926 |
స్థాపకుడు | జమ్నాలాల్ బజాజ్ |
ప్రధాన కార్యాలయం | , |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తంగా |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | |
యజమాని |
|
ఉద్యోగుల సంఖ్య | 60,000+[2] |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www |
బజాజ్ గ్రూప్ అనేది 1926 సంవత్సరంలో ముంబైలో జమ్నాలాల్ బజాజ్, మార్వాడీ అగర్వాల్ వ్యాపారవేత్తలు స్థాపించిన ఒక భారతీయ బహుళజాతి కంపెనీ.[3] ఈ గ్రూపులో 34 కంపెనీలు వరకు ఉన్నాయి, వీటిలో ప్రసిద్ధి గాంచిన బజాజ్ ఆటో ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీదారుగా ఉంది.[4] బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్, బజాజ్ హిందుస్థాన్, బజాజ్ హోల్డింగ్ & ఇన్వెస్ట్ మెంట్ వంటి ఇతర ప్రముఖ గ్రూపు కంపెనీలు ఉన్నాయి. ఆటోమొబైల్స్ (2- 3చక్రాల వాహనాలు), గృహోపకరణాలు, ఎలక్ట్రికల్, ఇనుము, ఉక్కు, బీమా, ట్రావెల్, ఫైనాన్స్[5] వంటి వివిధ పరిశ్రమలలో వంటి రంగాలు ఉన్నాయి.
బజాజ్ గ్రూప్ ను 1926 సంవత్సరంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీకి సన్నిహితుడైన జమ్నాలాల్ బజాజ్ స్థాపించాడు. గాంధీజీ జమ్నాలాల్‌ను తన ఐదవ కొడుకుగా భావించారని అంటారు.
1931 సంవత్సరంలో, మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు, బజాజ్ ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో చక్కెర కర్మాగారాన్ని స్థాపించినాడు (దీనిని 1988 లో బజాజ్ హిందూస్థాన్ లిమిటెడ్ గా 1988 సంవత్సరంలో) పేరు మార్చబడింది. జమ్నాలాల్ బజాజ్ పెద్ద కుమారుడు కమలనయన్ బజాజ్, ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత, భారతదేశానికి తిరిగి వచ్చి, కుటుంబ వ్యాపారంలో చేరి, స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలు, సిమెంట్, ఉక్కు , విద్యుత్ ఉపకరణాలుగా పరిశ్రమలలో వ్యాపారమును విస్తరణ చేశాడు. బచ్రాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ప్రయివేట్ లిమిటెడ్ నవంబర్ 1945 సంవత్సరంలో స్థాపించబడింది.
1948 సంవత్సరంలో, బజాజ్ ఆటో భారతదేశంలో ద్విచక్ర , త్రిచక్ర వాహనాలను దిగుమతి చేసుకోవడం ద్వారా తన అమ్మకాలను ప్రారంభించింది. 1959 సంవత్సరంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల తయారీకి ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందింది. కమలనయన్ బజాజ్ కుమారుడు రాహుల్ బజాజ్ గ్రూప్ ఉక్కు సంస్థ అయిన ముకంద్ లో జూనియర్ పర్చేజ్ ఆఫీసర్ గా పనిచేశాడు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( ఎంబిఎ) పట్టా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పొందాడు. అతడు 1995 సంవత్సరంలో బజాజ్ గ్రూప్ ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.[6]
జమ్నాలాల్ బజాజ్ 'వ్యక్తిగత లాభం కంటే ఉమ్మడి మంచి ముఖ్యం' అని ఆయన దృఢంగా నమ్మాడు. ఇది సంస్థలకు సమాజానికి సేవ చేయడానికి ప్రోత్సహించింది. అతని తత్త్వాన్ని అతని కుమారులు కమలనయన్ బజాజ్, శ్రీ రామకృష్ణ బజాజ్ లు గ్రహించి, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళారు, ఆ తరువాత రాహుల్ బజాజ్ ఇదే పద్దతిని అనుసరించాడు. జమ్నాలాల్ బజాజ్ ద్వారా పొందిన ఆశయాలు, సద్గుణాలు గ్రూపును విజయం, గౌరవం పారిశ్రామిక రంగాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.[7]
భారతీయ సమాజానికి, బజాజ్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక సాధికారతకు ప్రోత్సాహకం విస్తృతమైన ఉత్పత్తులు,సేవలను అందిస్తుంది, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నతంగా నిలుస్తోంది.
బజాజ్ గ్రూపు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పాలసీలో వ్యాపారంలో ట్రస్టీషిప్ భావన ద్వారా మార్గదర్శనం చేయబడే వివిధ సంక్షేమ కార్యకలాపాలు ఇమిడి ఉంటాయి. బజాజ్ గ్రూపు సామాజిక, సంక్షేమ లక్ష్యాల కొరకు అనేక ట్రస్టులు, ఫౌండేషన్ ల ద్వారా నెరవేరుతున్నాయి. దాదాపుగా ప్రతి సంవత్సరం 100 మిలియన్ల (US$ 1.4 మిలియన్లు) ఈ ట్రస్ట్, ఫౌండేషన్లకు ఖర్చు చేస్తారు. బజాజ్ గ్రూపు కార్పొరేట్ సామాజిక బాధ్యత లో ప్రాంతాలు ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సహజ వనరులు,, స్వావలంబన అభివృద్ధి చేయడం లక్ష్యం గా పెట్టుకున్నారు.[8]
బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్, హెర్క్యులస్ హోయిస్ట్స్ లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ లిమిటెడ్, బజాజ్ హిందుస్థాన్ లిమిటెడ్, బజాజ్ హోల్డింగ్ & ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థల కారణంగా బజాజ్ గ్రూప్ 10 దశాబ్దాలకు పైగా దేశ పారిశ్రామిక రంగములో ఉన్నత స్థాయిలో పేరుగాంచినది .బజాజ్ ఆటో ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ద్విచక్ర , త్రిచక్ర వాహన తయారీదారుగా ఉంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ , ఆగ్నేయాసియా దేశాలలో బజాజ్ ప్రజాదరణ పొందిన బ్రాండ్.
ఈ సంస్థ ఇప్పటివరకు అనేక పరిశ్రమల పెరుగుదలకు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యున్నతికి సహాయపడింది. రాహుల్ బజాజ్ మార్గదర్శకత్వంలో, బజాజ్ ఆటో రూ .72 మిలియన్ల కంపెనీ నుండి రూ .120 బిలియన్ కంపెనీగా మారింది. ప్రస్తుతం, బజాజ్ గ్రూపుకు 2018 నాటికి రూ. 3.9 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో 90 సంవత్సరాల అనుభవం తో ప్రపంచవ్యాప్తంగా 36,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.[9]