బదాయి దో | |
---|---|
దర్శకత్వం | హర్షవర్ధన్ కులకర్ణి |
రచన |
|
నిర్మాత | వినీత్ జైన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్వప్నిల్ సోనావానే |
కూర్పు | కీర్తి నకాహ్వా |
సంగీతం | నేపథ్యం సంగీతం: హితేష్ సోనిక్ పాటలు:
|
నిర్మాణ సంస్థ | జంగ్లీ పిక్చర్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 11 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 35 కోట్లు [1] |
బాక్సాఫీసు | 28.33 కోట్లు |
బదాయి దో 2022లో విడుదలైన హిందీ సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్దన్ కులకర్ణి దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, భూమి ఫెడ్నేకర్, సీమా పహ్వా, షీబా చడ్డా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 జనవరి 25న విడుదల చేసి[2], సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేశారు.
బదాయి దో 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) , ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డులు అందుకుంది.[3]
రాజ్ కుమార్ రావు (శార్దూల్ ఠాకూర్), భూమి పెడ్నేకర్ (సుమి) పెళ్లి అవుతుంది. అయితే ఆ పెళ్లి కూడా ఓ ఒప్పందం ప్రకారం చేసుకుంటారు. పోలీస్ ఆఫీసర్‌గా పని చేసే శార్దూల్ ఓ గే, పీటీ టీచర్‌గా పని చేసే సుమి ఓ లెస్బియన్. కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలను తప్పించుకునేందుకు పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. వారి గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. చివరకు వీరి బంధం ఎలా మలుపు తిరుగుతుంది? శార్దూల్, సుమిల గురించి అందరికీ తెలుస్తుందా ? కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు? తరువాత ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[6]