బషీరాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°13′00″N 77°26′00″E / 17.2167°N 77.4333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | బషీరాబాద్ |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,562 |
- పురుషులు | 21,603 |
- స్త్రీలు | 21,959 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.96% |
- పురుషులు | 54.07% |
- స్త్రీలు | 30.47% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
బషీరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] బషీరాబాద్, ఈ మండలానికి కేంద్రం. ఇది రంగారెడ్డి జిల్లా పశ్చిమ సరిహద్దున ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. నవంద్గీ పేరుతో ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఈ రైల్వే స్టేషను హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి వెళ్ళు మార్గంలో ఉంది. హైదరాబాదు నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వేస్టేషను మార్గంలో తెలంగాణలో చివరి రైల్వేస్టేషను.ఈ రైల్వేస్టేషను నవాంద్గి రైల్వేస్టేషనుగా పిలువబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
ప్రాథమికోన్నత పాఠశాలలు[3]
ఉన్నత పాఠశాలలు[3]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,562 - పురుషులు 21,603 - స్త్రీలు 21,959. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేంఈ రాలేదు. వైశాల్యం 204 చ.కి.మీ. కాగా, జనాభా 43,562. జనాభాలో పురుషులు 21,603 కాగా, స్త్రీల సంఖ్య 21,959. మండలంలో 8,800 గృహాలున్నాయి.[4]
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు