బషీర్‌బాగ్ ప్యాలెస్

బషీర్‌బాగ్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్తి చేయబడినదిసుమారు 1880

బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]

చరిత్ర

[మార్చు]

1872లో సాలార్ జంగ్ ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.[2] అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం నిజాం కళాశాల ఉంది.[3]

నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.[4]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.
  2. "Bashir-bagh Palace, Hyderabad". British Library. Archived from the original on 22 మార్చి 2008. Retrieved 27 సెప్టెంబరు 2018.
  3. వెబ్ ఆర్కైవ్, నవ తెలంగాణ (23 July 2018). "విద్యాకుసుమం..నిజాం కళాశాల". Archived from the original on 27 September 2018. Retrieved 27 September 2018.
  4. "Archived copy". Archived from the original on 5 జూలై 2008. Retrieved 27 సెప్టెంబరు 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link) An ustad's legacy