బసు భట్టాచార్య | |
---|---|
జననం | 1934 |
మరణం | 1997 జూన్ 19[1] | (వయసు 62–63)
పిల్లలు | ఒక కుమారుడు (దర్శకుడు ఆదిత్య భట్టాచార్య), ఇద్దరు కుమార్తెలు (చిమ్ము, అన్వేషా ఆర్య-రచయిత) |
పురస్కారాలు | 1967:జాతీయ ఉత్తమ చిత్రం: తీస్రీ కసమ్ 1985: ఫిలింఫేర్ ఉత్తమ సినిమా అవార్డు: స్పర్ష్ |
బసు భట్టాచార్య (1934 - 19 జూన్ 1997) హిందీ సినిమా దర్శకుడు.[2][3] 1966లో తీసిన తీస్రీ కసమ్ సినిమా ద్వారా పేరు పొందాడు. రాజ్ కపూర్, వహీదా రెహమాన్ నటించిన ఈ సినిమా 1967లో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భట్టాచార్య దర్శకత్వం వహించిన అవిష్కార్ సినిమా అత్యంత ప్రజాదరణ పొందడమేకాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ గైడ్ కలెక్షన్స్[4] లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 1975లో రాజేష్ ఖన్నాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
1979లో భట్టాచార్య నిర్మించిన స్పర్ష్ సినిమాలకు హిందీలో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది, ఫిలింఫేర్ ఉత్తమ సినిమా అవార్డును కూడా గెలుచుకుంది.[5] 1976 నుండి 1979 వరకు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.[6] 1981లో 12 వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[7]
భట్టాచార్య 1934లో పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా లో జన్మించాడు.
1958లో మధుమతి, సుజాత వంటి సినిమాలకు బిమల్ రాయ్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అటు తరువాత బిమల్ రాయ్ కుమార్తె రింకి భట్టాచార్యను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి బిమల్ రాయ్ అంగీకరించడకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.[8][9] భట్టాచార్య దంపతులకు ఒక కుమారుడు (దర్శకుడు ఆదిత్య భట్టాచార్య), ఇద్దరు కుమార్తెలు (చిమ్ము, అన్వేషా ఆర్య-రచయిత) ఉన్నారు. అనేక గృహహింస సంఘటనల తరువాత, అతని భార్య రింకి 1983లో ఇతని నుండి విడిపోయింది. 1990లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. భారతదేశంలో గృహహింసలపై పోరాటానికి రింకి కృషిచేసింది. సంకలనకర్తగా బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ - డొమెస్టిక్ వాయిలెన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. రచయితగా, కాలమిస్ట్ గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా రింకి పేరుపొందింది.[10]
1997, జూన్ 19న మహారాష్ట్ర లోని, ముంబై లో మరణించాడు.
{{cite book}}
: |work=
ignored (help)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)