బాచుపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′N 78°24′E / 17.54°N 78.4°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | బాచుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 27,563 |
- పురుషుల సంఖ్య | 14,061 |
- స్త్రీల సంఖ్య | 13,502 |
- గృహాల సంఖ్య | 7,297 |
Pin Code : 500072 | |
ఎస్.టి.డి కోడ్ పిన్ కోడ్08692 |
బాచుపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]గతంలో ఇది జనగణన పట్టణం,తరువాత ఇది నిజాంపేట నగరపాలక సంస్థలో విలీనమైంది. ఇది మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌లోని బాచుపల్లి మండలానికి చెందిన మండల కేంద్రం.[2] రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండేది.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 27,563 - పురుషుల సంఖ్య 14,061 - స్త్రీల సంఖ్య 13,502 - గృహాల సంఖ్య 7,297.[4]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 7694 పురుషులు 3933, స్త్రీలు 3761 గృహాలు 1843 విస్తీర్ణము, 1215 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు.
లోగడ బాచుపల్లి గ్రామం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాచుపల్లి గ్రామం/పట్టణ ప్రాంతాన్ని (1+01) రెండు పట్టణ/గ్రామ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
ఇక్కడున్న పాఠశాలలు.[4]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బాచుపల్లి నుండి ఐటి కారిడార్‌కు, నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. హఫీజ్‌పేటలో సమీప ఎంఎంటీఎస్ రైలు స్టేషన్ ఉంది. సమీపంలోని మియాపూర్, జె.ఎన్.టి.యు. ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
బాచుపల్లి బిన్ కుంట సరస్సు (బిరుని), మెద్దికుంట పెద్ద సరస్సులు వంటివి బాచుపల్లిలో మొత్తం 17 సరస్సులు ఉన్నాయి.
2 ఎకరాల సువిశాలమైన స్థలంలో 3.5 కోట్ల రూపాయలతో 21వేల చదరపు అడుగుల్లో జి+2 అంతస్తుల్లో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని 2023 మార్చి 24న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ప్రారంభించారు.[5]