బాబా | |
---|---|
![]() | |
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | శ్రీ రామకృష్ణ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | రజినీకాంత్ |
కథ | రజినీకాంత్ |
నిర్మాత | రజినీకాంత్ |
తారాగణం | రజినీకాంత్ మనీషా కోయిరాలా |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | వి. టి. విజయన్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | లోటస్ ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | లోటస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2002 |
సినిమా నిడివి | 174 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తమిళం |
బాబా 2002 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] రజనీకాంత్, మనీషా కొయిరాలా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను రజనీయే నిర్మించడం కాకుండా కథ కూడా అందించాడు.[2] ఎ. ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.[3]
బాబా చిన్నతనంలోనే సాధువుల, ఋషుల ఆశీర్వాదంతో పుట్టి పెరుగుతాడు. ముఖ్యంగా రెండు వేల యేళ్ళుగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి ఆశీర్వాదం ఇతనికి ఉంటుంది. కానీ బాబా పెరిగేకొద్దీ అతనికి దేవుడి మీద అంతగా విశ్వాసం ఉండదు. కానీ అతనికి తెలియకుండానే బాబాజీ అతన్ని హిమాలయాలకు నడిపిస్తాడు. ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. ఆ మంత్రం జపించి అతను ఏది కోరుకుంటే అది జరుగుతుంది. దాన్ని కేవలం ఏడు సార్లు మాత్రమే వాడుకోగలడని చెబుతాడు. మొదట్లో వాటి మీద ఏ మాత్రం నమ్మకం లేని బాబా చిన్న చిన్న విషయాలకే ఆరుసార్లు వాడేస్తాడు.