బాబీ జాసూస్ (2014 దక్కనీ హిందీ సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సమార్ షేక్ |
నిర్మాణం | దియా మీర్జా సాహిల్ సంఘా |
రచన | సమార్ షేక్ |
కథ | సమార్ షేక్ |
చిత్రానువాదం | సంయుక్త చావ్లా షేక్ |
తారాగణం | విద్యా బాలన్ అలీ ఫజల్ అర్జన్ బజ్వా |
సంగీతం | శంతను మొయిత్రా స్వానంద్ కిర్కిరే (lyrics) |
ఛాయాగ్రహణం | విశాల్ సిన్హా |
కూర్పు | హేమల్ కొఠారీ |
పంపిణీ | రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ |
విడుదల తేదీ | 2014 |
నిడివి | 121 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | దక్కనీ హిందీ |
పెట్టుబడి | ₹26 కోట్లు[1] |
వసూళ్లు | est.₹20.38 కోట్లు[2] |
నిర్మాణ_సంస్థ | బార్న్ ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ |
బాబీ జాసూస్ (అనువాదం: డిటెక్టివ్ బాబీ ) సమార్ షేక్ దర్శకత్వంలో దియా మీర్జా , సాహిల్ సంఘా నిర్మించిన 2014 భారతీయ దక్కనీ భాష హాస్య నాటకీయ చిత్రం. విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అలీ ఫజల్, అర్జన్ బజ్వా, సుప్రియా పాఠక్, రాజేంద్ర గుప్తా, తన్వి అజ్మీ సహాయక పాత్రల్లో నటించారు. వరుస అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ డిటెక్టివ్ కావాలని కోరుకునే బిల్కీస్ "బాబీ" అహ్మద్ అనే హైదరాబాదీ మహిళ కథ ఇది.
పాత హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి, సంప్రదాయ కుటుంబంలో నివసిస్తున్న బిల్కీస్ అహ్మద్, అలియాస్ బాబీ, ఒక ప్రైవేట్ డిటెక్టివ్. ఆమె తన అబ్బా, అమ్మీ, ఇద్దరు చెల్లెళ్ళు కౌసర్ ఖాలా,నూర్ లతో కలిసి చార్మినార్ సమీపంలోని మొఘల్‌పురా ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. గూఢచర్యం పట్ల ఆమెకున్న అభిరుచిని కొనసాగించడానికి, బాబీ తన తల్లిదండ్రులు చేస్తున్న పెళ్ళి ప్రయత్నాలనుండి తప్పించుకోవడానికి టీవీ షో హోస్ట్ అయిన తసావుర్‌కు సహాయం చేయడం వంటి చిన్న చిన్న కేసులను పరిష్కరిస్తూ ఉంటుంది. ధనవంతుడైన ఎన్ఆర్ఐ అనీస్ ఖాన్, చేతిపై భుజంపై పుట్టుమచ్చలున్న 'నిలోఫర్' , 'ఆమ్నా' అనే ఇద్దరు తప్పిపోయిన బాలికలను కనిపెట్టే కేసును అప్పజెప్పినప్పుడు బాబీకి పెద్ద అవకాశం లభిస్తుంది. ఈ కేసును పరిష్కరించడానికి బాబీ 'బిచ్చగత్తె', 'ప్యూన్', 'హాకర్', 'తెలివైన విద్యార్థిని', 'జ్యోతిష్యురాలు' నకిలీ 'టీవీ నిర్మాత' వంటి అనేక వేషాలను ధరిస్తుంది. లక్ష్యాలను గుర్తించిన తరువాత, ఖాన్ ఆమెకు పెద్దమొత్తంలో రుసుము చెల్లిస్తాడు. ఇద్దరు అమ్మాయిల తండ్రులకు కూడా భారీ మొత్తంలో డబ్బును అందిస్తాడు. ఖాన్ 'అలీ' అనే బొటనవేలు లేని బాలుడిని కనుగొనే తన మూడవ, చివరి కేసును కూడా అప్పగిస్తాడు.
ఇంతలో, బాబీ తసవుర్ కుటుంబాలు వారిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించుకుంటాయి. లాలా అనే స్థానిక గూండా కూడా లాలా ప్రియురాలు ఆఫ్రీన్ (అనుప్రియ గోయెంకా)కు ఆమె తల్లి సైదా బలవంతంగా చేస్తున్న వివాహాన్ని విచ్ఛిన్నం చేయమని బాబీకి ఒక కేసును అందిస్తాడు. అయితే దానికి బాబీ నిరాకరించినప్పుడు, తాను ఎన్ఆర్ఐ ఖాన్‌కి సహాయం చేసి తప్పుచేసినట్లు లాలా ఆమెకు చెబుతాడు. దానితో అనుమానం వచ్చి బాబీ ఆ ఇద్దరు అమ్మాయిల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారు కనిపించడం లేదని తెలుస్తుంది. భయాందోళనలతో బాబీ, తసవుర్ నుండి సహాయం తీసుకొని, ఖాన్‌కు చెందిన 5 నక్షత్రాల హోటల్ గదిలోకి చొరబడి అతని నేపథ్యాన్ని తనిఖీ చేస్తుంది. ఖాన్ హోటల్ సిబ్బంది ఆమెను పట్టుకుని బయటకు గెంటేస్తారు. కానీ బాబీ ఖాన్ డైరీని, అతని పాత ఫోటోని సంపాదిస్తుంది. అవి తరువాత లాలా చేతుల్లోకి వస్తుంది, అతను బాబీని అనుసరించడం ప్రారంభిస్తాడు. ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. తన మూడవ లక్ష్యం అలీ లేకుండా ఖాన్ పట్టణం విడిచి వెళ్ళలేడనే నమ్మకంతో బాబీ అతని కోసం వెతకడం ప్రారంభిస్తుంది. లండన్కు చెందిన లైబ్రరీ స్టాంప్, స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ ఆర్డర్ వంటి ఖాన్ డైరీలోని ఆధారాల సహాయంతో, బాబీ ఖాన్ నేపథ్యం గురించి తెలుసుకొంటుంది. తరువాత ఖాన్ అలీని అనుసరిస్తున్నట్లు చూపబడుతుంది. ఇది ఖాన్‌ను పట్టుకోడానికి ఒక ఉచ్చు అని తేలింది. చివరలో అనేక మలుపులు తిరిగి , ఖాన్ వెతుకుతున్న ముగ్గురు వ్యక్తులు మతపరమైన అల్లర్ల సమయంలో చాలాకాలంగా కోల్పోయిన తన పిల్లలు అని తెలుస్తుంది. ఖాన్ తన కూతుళ్ళను పెంచి పోషించిన తల్లిదండ్రులకు ధనసహాయం చేసి ఉన్నత విద్యను అభ్యసించడానికి తన కూతుళ్ళను లండన్‌కు పంపి ఉంటాడు.'లాలా'యే ఖాన్ చాలాకాలం క్రితం కోల్పోయిన తన కుమారుడు 'అలీ' అంటూ తసవుర్ కూడా సన్నివేశంలోకి ప్రవేశిస్తాడు. బాబీ ఒక ప్రసిద్ధ డిటెక్టివ్‌గా మారడంతో ఈ చిత్రం ముగుస్తుంది. అయితే ఆమె తసవుర్ ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటుంటారు, కానీ వారి వివాహం ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలి ఉంటుంది.
దియా మీర్జా తల్లి అత్యవసర గుండె శస్త్రచికిత్స కారణంగా బాబీ జాసూస్ చిత్రీకరణ షెడ్యూల్ తేదీ నుండి 11 రోజులు వాయిదా పడింది. 2013 నవంబర్ 25 నుండి చిత్రీకరణ ప్రారంభమవుతుందని మీర్జా తరువాత పేర్కొంది.[3] ఈ చిత్రం కథ ఆధారంగా నిర్మించిన హైదరాబాద్ నగరం నుండి ప్రారంభమవుతుంది. జనవరి 2014 నాటికి పూర్తి కావాల్సి ఉంది.[4][5] ఈ చిత్రం షూటింగ్ 2013 నవంబర్ 23న ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని 55 రోజుల సుదీర్ఘ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.[6]
విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించగా, ఆమె సరసన అలీ ఫజల్ సంతకం చేయబడింది.[7]
బాబీ జాసూస్ | |||
---|---|---|---|
సౌండ్ ట్రాక్ by శంతను మొయిత్రా | |||
Released | Error: All values must be integers (help)[8] | ||
Genre | Feature film soundtrack | ||
Length | 30:12 | ||
Language | హిందీ | ||
Label | టి-సిరీస్ | ||
|
శంతను మొయిత్రా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, స్వానంద్ కిర్కిరే సాహిత్యం రాశారు. గాయని శ్రేయా ఘోషల్, పాపోన్ కూడా ఈ చిత్రం కోసం ఒక పాటను రికార్డ్ చేశారు. ఐశ్వర్య నిగమ్ కూడా ఒక పాటను రికార్డ్ చేసింది.[9] గాయకుడు బోనీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్తో కలిసి ఈ చిత్రం కోసం ఒక యుగళగీతం రికార్డ్ చేసినట్లు చెప్పాడు.[10]
సం. | పాట | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|
1. | "జష్న్" | బోనీ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్ | 5:55 |
2. | "తూ" | పాపోన్, శ్రేయ ఘోషాల్ | 7:02 |
3. | "B.O.B.B.Y" | నీరజ్ శ్రీధర్, శ్రేయ ఘోషాల్ | 5:35 |
4. | "స్వీటీ" | ఐశ్వర్య నిగమ్, మోనాలీ ఠాకూర్ | 4:38 |
5. | "తూ" (పునరావృతం) | పాపోన్, శ్రేయ ఘోషాల్ | 7:03 |