బాబూ బ్యాండ్ బాజా | |
---|---|
![]() బాబూ బ్యాండ్ బాజా సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రాజేష్ పింజానీ |
రచన | రాజేష్ పింజానీ |
నిర్మాత | నీతా జాదవ్ |
తారాగణం | మిలింద్ షిండే మితాలీ జగ్తాప్ వరద్కర్ వివేక్ చాబుక్వర్ |
ఛాయాగ్రహణం | అశుతోష్ ఆప్టే, రాజా వరద్కర్, సందీప్ వరద్కర్ |
కూర్పు | సంతోష్ గోథోస్కర్ |
సంగీతం | రోహిత్ నాగభీడే |
పంపిణీదార్లు | దార్ మూవీస్ |
విడుదల తేదీ | 13 ఏప్రిల్ 2012 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మరాఠీ |
బడ్జెట్ | ₹0.75 crore (US$94,000) |
బాక్సాఫీసు | ₹2.10 crore (US$2,60,000) |
బాబూ బ్యాండ్ బాజా, 2012 ఏప్రిల్ 13న విడుదలైన మరాఠీ సినిమా. నితా జాదవ్ నిర్మాణంలో రాజేష్ పింజానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిలింద్ షిండే, మితాలీ జగ్తాప్ వరద్కర్, వివేక్ చాబుక్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (మితాలీ జగ్తప్ వరద్కర్), దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, జాతీయ ఉత్తమ బాలనటి (వివేక్ చాబుక్స్వర్) మొదలైన మూడు విభాగాల్లో అవార్డులు సాధించింది. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఆరు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.