బాలా | |
---|---|
![]() | |
దర్శకత్వం | అమర్ కౌశిక్ |
రచన | కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్: నిరేన్ భట్ అడిషనల్ స్క్రీన్ ప్లే: రవి ముప్పా ఒరిజినల్ కథ: పావెల్ భట్టాచార్జీ |
నిర్మాత | దినేష్ విజన్ |
తారాగణం | ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్, భూమి ఫెడ్నేకర్ |
Narrated by | విజయ్ Raaz |
ఛాయాగ్రహణం | అనుజ్ రాకేష్ ధావన్ |
కూర్పు | హేమంతి సర్కార్ |
సంగీతం | పాటలు & ఒరిజినల్ స్కోర్ : సచిన్ -జిగర్ అతిధి కంపోజర్స్: జానీ బి ప్రాక్ |
నిర్మాణ సంస్థలు | మ్యాడ్‌డాక్ ఫిలింస్ జియో స్టూడియోస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 7 నవంబర్ 2019 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | హిందీ |
బడ్జెట్ | 25 కోట్లు[1] |
బాక్సాఫీసు | 171 కోట్లు[2] |
బాలా 2019లో విడుదలైన హిందీ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్, జియో స్టూడియోస్ బ్యానర్ల పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 నవంబర్ 2019న విడుదలైంది.
బాల్ ముకుంద్ అలియాస్ బాలా (అయుష్మాన్ ఖురానా ) కు బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్ చేస్తుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్‌లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగదు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. ఈ క్రమంలో పారి మిశ్రా ( యామి గౌతమ్) ను ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని ఆమెకు తెలిస్తే పరిస్థితేంటి ? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు ? అన్నదే మిగతా సినిమా కథ.[3]