వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | భగవత్ సుబ్రమణ్య చంద్రశేఖర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మైసూరు, మైసూరు సామ్రాజ్యం | 1945 మే 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 106) | 1964 జనవరి 21 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1979 జూలై 12 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 20) | 1976 ఫిబ్రవరి 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2014 నవంబరు 10 |
భగవత్ సుబ్రమణ్య చంద్రశేఖర్ (జననం 1945 మే 17) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. లెగ్ స్పిన్నర్లలో అగ్రశ్రేణి ఆటగాడిగా పరిగణించబడే చంద్రశేఖర్, EAS ప్రసన్న, బిషెన్ సింగ్ బేడీ, శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్‌లతో కలిసి 1960లు, 1970లలో స్పిన్ బౌలింగ్‌లో ఆధిపత్యం వహించిన భారత స్పిన్ చతుష్టయంలో భాగం. [1] చాలా చిన్న వయస్సులో పోలియో వలన అతని కుడి చేయి వంగిపోయింది. చంద్రశేఖర్ తన పదహారేళ్ల కెరీర్‌లో 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 29.74 సగటుతో 242 వికెట్లు తీశాడు. [1] బ్యాట్స్‌మన్‌గా చేసిన పరుగుల కంటే బౌలరుగా తీసిన వికెట్లే ఎక్కువ అనే రికార్డు సాధించిన ఇద్దరు టెస్ట్ క్రికెటర్లలో అతను ఒకడు. మరొకరు క్రిస్ మార్టిన్.
చంద్రశేఖర్‌కి 1972లో పద్మశ్రీ పురస్కారం లభించింది.[2] అతను 1972లో <i id="mwHw">విస్డెన్</i> క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు; అతను 1971లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై 38 పరుగులకు ఆరు వికెట్లు తీసిన అతని ప్రదర్శనను[3] భారతదేశం తరపున "ఈ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శన" గా 2002 లో విజ్డెన్ అవార్డును చంద్ర గెలుచుకున్నాడు. అతను 2004లో సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది మాజీ క్రికెట్ ఆటగాడికి బిసిసిఐ అందించే అత్యున్నత గౌరవం.[4]
చంద్రశేఖర్ 1945లో మైసూరులో జన్మించాడు. అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించాడు. [5] ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ రిచీ బెనాడ్ ఆటను చూడడంతో క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఆరేళ్ల వయసులో పోలియో సోకి అతని కుడి చేయి పడిపోయింది. 10 సంవత్సరాల వయస్సులో ఆ చేయి కోలుకోవడంతో చంద్రశేఖర్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. [5]
ఆ సమయానికి అతని కుటుంబం బెంగళూరుకు మకాం మార్చింది. అతనికి "సిటీ క్రికెటర్స్" కోసం ఆడే అవకాశం వచ్చింది. [5] ప్రధానంగా తాను లెదర్ బాల్‌తో ఆడే అవకాశం కోసం తాను అక్కడ చేరినట్లు చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. [5] బెంగుళూరు వీధుల్లో ఆడుతున్నప్పుడు అతను ప్రధానంగా రబ్బరు బంతిని ఉపయోగించేవాడు. క్లబ్ కోసం ఆడుతున్నప్పుడు, చంద్రశేఖర్ ఫాస్ట్ బౌలింగ్‌తో సహా విభిన్న బౌలింగ్ శైలులను ప్రయత్నించాడు. [5] 1963లో లెగ్ స్పిన్ బౌలర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపికవడం, అతని ఆలోచన సరైనదని నిరూపితమైంది. [5]
1964లో బాంబేలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అదే సంవత్సరం ఇండియన్ క్రికెట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు. 1971లో ది ఓవల్‌లో 38 పరుగులకు ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‌లో భారతదేశం తన మొదటి విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాడు; 2002లో విజ్డెన్ ఈ బౌలింగును "శతాబ్దపు భారత బౌలింగ్ ప్రదర్శన"గా పేర్కొంది [6] విస్డెన్ "అతని తరహా బౌలింగులో అతను చూపే ఖచ్చితత్వం అద్భుతమైనది. మందకొడిగా ఉండే ఓవల్ పిచ్‌లో కూడా అతని అదనపు పేస్, బలీయమైన ప్రభావం చూపింది." [7] 1971లో అతని స్థిరమైన బౌలింగ్ ప్రదర్శనల కారణంగా, 1972లో అతను ఐదుగురు విస్డెన్ క్రికెటర్లలో ఒకడుగా పేరుపొందాడు. [6]
1976లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చంద్రశేఖర్, ప్రసన్న 19 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక అంపైరును ఉద్దేశీంచి చంద్ర చేసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధి గాంచింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో అతను చేసిన అనేక ఎల్‌బిడబ్ల్యు అప్పీళ్ళను అంపైరు నాటౌట్‌గా ఇచ్చారు. ఒక బ్యాట్స్‌మన్ బౌల్డ్అ అయినపుడు అతను అంపైరుతో ఇలా అన్నాడు: "అతను బౌల్డ్ అయ్యాడని నాకు తెలుసులే. కానీ, అతను అవుట్ అయ్యాడంటారా?"[8][9] 1977-78లో ఆస్ట్రేలియాలో భారత్ విజయంలో కూడా చంద్రశేఖర్ ప్రధాన పాత్ర పోషించాడు.[1] ఆ సిరీస్‌లో అతను ఓ టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లోనూ ఒకే విధమైన గణాంకాలను నమోదు చేసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు (52కి 6).[10]
చంద్రశేఖర్ బ్యాటింగ్ నైపుణ్యం గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. అతని టెస్ట్ సగటు 4.07. [11] 1977-78 ఆస్ట్రేలియన్ టూర్‌లో అతను సాధించిన నాలుగు డకౌట్ల (సున్నా స్కోరు) జ్ఞాపకార్థం చిల్లు ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రే-నికోల్స్ బ్యాట్‌ను బహూకరించారు.[12] అతని ఖాతాలో మొత్తం 23 టెస్ట్ డకౌట్లు ఉన్నాయి. [13] అతను టెస్ట్ క్రికెట్‌లో తీసిన వికెట్ల (242) కంటే అతని బ్యాటింగులో చేసిన పరుగులు తక్కువ. (167) [11] ఈ ప్రత్యేకత కలిగిన మరొక క్రికెటర్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ మార్టిన్ . [14]