బిజోయ్ కృష్ణ హండిక్ | |||
Handique in 2010 | |||
రక్షణ & పార్లమెంటరీ వ్యవహారాలు, గనులు, రసాయనాలు & ఎరువుల శాఖల సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
తరువాత | దిన్షా పటేల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | జోర్హాట్ | ||
గనుల, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి
| |||
పదవీ కాలం మే 2009 – 18 జనవరి 2011 (గనుల మంత్రి) జూలై 2011 (ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి) | |||
పదవీ కాలం 1991 – 15 May 2014 | |||
ముందు | పరాగ్ చలిహా | ||
తరువాత | కామాఖ్య ప్రసాద్ తాసా | ||
నియోజకవర్గం | జోర్హాట్ | ||
పదవీ కాలం 1980 – 1985 | |||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1972 – 1976 | |||
ముందు | జె. సైకియా | ||
తరువాత | దులాల్ బారుహ్ | ||
నియోజకవర్గం | జోర్హాట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2015 జూలై 26 జోర్హాట్, అస్సాం, భారతదేశం | (వయసు 80)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | స్వరూప్ రాణి బోర్గోహైన్ | ||
సంతానం | 3 |
బిజోయ్ కృష్ణ హండిక్ (1 డిసెంబర్ 1934 - 26 జూలై 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి శాసనసభ్యుడిగా, ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా,[1] ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.
బిజోయ్ కృష్ణ హండిక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972 నుండి 1976 వరకు జోర్హాట్ నుండి అస్సాం శాసనసభ సభ్యునిగా పని చేశాడు. ఆయన 1973లో ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నాడు. బిజోయ్ కృష్ణ హండిక్ 1980 నుంచి 1986 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేసి 1991లో జరిగిన లోక్‍సభ ఎన్నికలలో జోర్హాట్ నుండి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991 నుండి 2009 వరకు వరుసగా ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2004 నుండి 2007 వరకు రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా, 2006 నుండి 2009 వరకు రసాయనాలు & ఎరువులు శాఖల సహాయ మంత్రిగా, 2009 నుండి 2011 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి & గనుల శాఖల సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2002లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయ్యాడు.
బిజోయ్ కృష్ణ హండిక్ అనారోగ్యంతో బాధపడుతూ జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 26 జూలై 2015న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[2][3][4]