Total population | |
---|---|
10,726 | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
![]() Jharkhand | |
భాషలు | |
Hindi • Birhor language | |
మతం | |
Traditional beliefs, Hinduism, Christianity | |
సంబంధిత జాతి సమూహాలు | |
Munda, Hos, Kols |
బిర్హోరు ప్రజలు ఒక గిరిజన (ఆదివాసీ) అటవీ ప్రజలు సాంప్రదాయకంగా సంచార జాతులు. ప్రధానంగా భారత రాష్ట్రమైన జార్ఖండులో నివసిస్తున్నారు. వారు బిర్హోరు భాషను మాట్లాడతారు. ఇది ఆస్ట్రోయాసియాటికు భాషా కుటుంబంలోని ముండాభాష సమూహానికి చెందినది.[1][2]
బిర్హరు అంటే అడవిలో నివసించే మనుషులు. " బీరు " అనే అంటే అడవి. హారు అంటే " మనుష్యులు ".[3]
బిర్హరులు చిన్న పొట్టితనాన్ని, పొడవాటి తల, ఉంగరాల జుట్టు, విశాలమైన ముక్కును కలిగి ఉంటాయి. వారు సూర్యుడి సంతతికి చెందిన వారని సూర్యుడి సంతతిగా గుర్తించే ఖార్వర్లు తమ సోదరులు అని వారు విశ్వసిస్తారు. జాతిపరంగా వారు శాంటాలు, ముండాలు, హోసులను పోలి ఉంటారు.[3][4]
జార్ఖండు లోని పాత హజారిబాగు, రాంచీ, సింఘుభూం జిల్లాల పరిధిలో అనేక చిన్న యూనిట్లుగా విభజించబడటానికి ముందు బిరుహర్లు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఒరిస్సా, ఛత్తీసుగఢు, పశ్చిమ బెంగాలు ప్రాంతాలలో కనిపిస్తారు.[5]జార్ఖండులో నివసిస్తున్న అల్పసంఖ్యాక షేడ్యూల్డు కులాలకు చెందిన 30 కులాలలో వారు ఒకరు.[6]
బిర్హరు ప్రజలు 10,000 ఉంటారని అంచనా.[2] కొన్ని వనరుల ఆధారంగా వారి సంఖ్య అంతకంటే తక్కువగా ఉంది.[7]
వారు బిర్హరు భాషను మాట్లాడుతారు. ఇది ఆస్ట్రోయాసియాటికు భాషా కుటుంబంలోని ముండా సమూహ భాషలకు చెందినది. వారి భాషకు సంతాలి, ముండారి, హో భాషలతో పోలికలు ఉన్నాయి. బిర్హర్లు సానుకూల భాషా వైఖరిని కలిగి ఉన్నారు. వారు తిరిగే ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న భాషలను స్వేచ్ఛగా ఉపయోగిస్తారు. సద్రి, సంతాలి, హో, ముండారిని ఉపయోగిస్తారు. వారి మొదటి భాషలో అక్షరాస్యత శాతం 1971 లో 0.02% ఉంది. అయితే 10% మంది హిందీలో అక్షరాస్యులు.[2]
వారు సాంప్రదాయ విశ్వాసాలను అనుసరిస్తారు.[2] పెంటకోస్తు క్రైస్తవ మతం వారి సమాజంలో ప్రవేశించింది. [8] వారిలో కొందరు హిందూ మతాన్ని కూడా అనుసరిస్తున్నారు.
"ఆదిమ జీవనాధార ఆర్థిక వ్యవస్థ" అనుసరించే బిర్హర్లు సంచార సేకరణ వేట (ముఖ్యంగా కోతుల కోసం) మీద ఆధారపడి జీవిస్తుంటారు. వారు కుందేళ్ళు, తిత్తిరి (చిన్న పక్షులు)పక్షులను కూడా వలలో వేస్తారు: తేనెను సేకరించి విక్రయిస్తారు. వారు ఒక నిర్దిష్ట జాతి తీగ నార నుండి తాళ్ళను తయారు చేస్తారు. అవి సమీప వ్యవసాయ ప్రజల సంతలలో విక్రయిస్తారు. కొంతవరకు పరిస్థితుల వల్ల బలవంతంగా విక్రయించగా, కొంతవరకు ప్రభుత్వ అధికారులు ప్రోత్సహంతో విక్రయిస్తారు. వారిలో కొందరు స్థిరమైన వ్యవసాయంలో స్థిరపడ్డారు కాని మరికొందరు తమ సంచార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాని వారు ఒక గ్రామంలో స్థిరపడినప్పుడు కూడా వారి ధోరణి సంచార జీవితాన్ని గడపడంగా ఉంటుంది. సామాజిక-ఆర్థిక స్థితి ప్రకారం బిర్హరనులు రెండు గ్రూపులుగా వర్గీకరించారు. తిరుగుతున్న బిర్హర్లను ఉథ్లలు అని పిలుస్తారు. స్థిరపడిన బిర్హోర్లను జంఘీసు అని పిలుస్తారు.[2][3][4][7][8]
బిర్హర్లు మతవిశ్వాసాలు మాయా-మత విశ్వాసాలు హోసుల నమ్మకాలతో సమానంగా ఉంటాయి. ముండారి దేవతలు సింగ్ బొంగా (సూర్యుడు [9]) హప్రం (పూర్వీకుల ఆత్మలు)లను అత్యధికంగా గౌరవిస్తారు. హప్రం బొంగాతో పాటు అతీంద్రియ ప్రపంచంలో నివసిస్తున్నట్లు నమ్ముతున్నప్పటికీ బిర్హర్లు ఈ రెండు వర్గాల అతీంద్రియ ఆత్మల మధ్య వ్యత్యాసాన్ని చూపుతారు. హప్రం బొంగా ఆధీనంలో ఉన్నట్లు విశ్వసిస్తారు. విశ్వం మొత్తానికి సింగు బొంగా, ఆయన భార్య చందు బొంగా అధ్యక్షత వహించారని బిర్హర్లు భావిస్తున్నారు. పౌసు, మాగు నెలలలో వీరిని పూజిస్తారు.[3][10]
తాత్కాలిక బిర్హర్లస్థావరాలను తండాలు (బ్యాండ్సు) అంటారు. ఇవి శంఖాకార ఆకారంలో కనీసం అర డజను గుడిసెలను కలిగి ఉంటారు. ఇవి ఆకులు, కొమ్మలతో నిర్మించబడతాయి. గృహ ఆస్తులలో సాంప్రదాయకంగా మట్టి పాత్రలు, కొన్ని త్రవ్వే పనిముట్లు, వేట, ఉచ్చు కోసం పనిముట్లు, తాడు తయారీ సాధనాలు, బుట్టలు మొదలైనవి ఉంటాయి. ఇటీవలి కాలంలో బిర్హర్లు గుడిసెలలోకి అల్యూమినియం, ఉక్కు ప్రవేశించాయి.[4]
బిర్హర్లు గిరిజన, వంశాలు వారి జాతిలో మాత్రమే వివాహసంబంధాలను ఏర్పరుచుకుంటాయి. ఒక బిర్హర్లు అబ్బాయి ఒక బిర్హరు అమ్మాయితో మాత్రమే వివాహం చేసుకోవలసి ఉంది. కాని అబ్బాయి, అమ్మాయి వంశమూలం ఒకేలా ఉండకూడదు. తాండాలు లేదా బృందాలు వేర్వేరు వంశాల కుటుంబాలను కలిగి ఉన్నాయి. కాని వారు తాండా భూస్వామ్య నియమాన్ని అనుసరిస్తారు. వివాహం సమయంలో రక్త సంబంధం అన్వేషించబడుతుంది. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య వివాహం తండ్రి, తల్లి వైపు నుండి మూడు తరాల వరకు సంబంధం లేనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
బిర్హర్లు సమాజంలో అతి చిన్న యూనిటు. సాంప్రదాయ వారసత్వం పురుషవారసత్వాన్ని అనుసరిస్తుంది. భార్యాభర్తల సంబంధం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. వారు తమ స్థిరపడిన పొరుగువారి మాదిరిగానే దుస్తులు ధరిస్తారు. ఎక్కువగా సాంప్రదాయ భారతీయ దుస్తులను ఉపయోగిస్తారు. కొంతవకు పాశ్చాత్య ప్రభావిత దుస్తులను ధరిస్తారు. మహిళలు ఆభరణాలను ఇష్టపడతారు. మొక్కలు పక్షులు, జంతువులు, నదులు మొదలైన వాటి పేరిట అనేక వంశాలుగా విభజించబడ్డాయి.[4]
బిర్హర్లు కన్యాశుల్కపద్ధతిని అనుసరిస్తారు. పిల్లవాడు వివాహం చేసుకోగలిగిన వయస్సు వచ్చినప్పుడు తన కొడుకు లేదా కుమార్తెలకు వివాహం చేసుకోవడం తండ్రి బాధ్యత. సాంప్రదాయ ఆచారం ప్రకారం బాలుడి తండ్రి అమ్మాయి తండ్రిని సంప్రదిస్తాడు. తరువాతి అంగీకరించినప్పుడు వారు బాలుడి తండ్రి వధువు ధరను అమ్మాయి తండ్రికి వివరిరిస్తాడు స్థిరపరుస్తారు. తరువాత వివాహం నిర్ణయించబడుతుంది.[4]
1947 లో భారత స్వాతంత్ర్యం తరువాత బిర్హర్లకు వారి భూమి, సాగు కోసం ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాలను ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. పిల్లల కోసం పాఠశాలలు, తాడు తయారీ కేంద్రాలు, తేనె సేకరణ శిక్షణా కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ బిర్హర్లు చాలా మంది సంచార జీవితానికి తిరిగి రావడంతో ఈ ప్రయత్నాలు తక్కువ ఫలాలను పొందాయి.[4]