బిల్కీస్ ఇద్రిస్ లతీఫ్ | |
---|---|
జననం | |
మరణం | 2007, అక్టోబరు 27 |
వృత్తి | సాంఘీక సేవిక రచయిత్రి |
తల్లిదండ్రులు | అలీ యావర్ జంగ్ ఆలిస్ ఇఫ్రిగ్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
బిల్కీస్ ఇద్రిస్ లతీఫ్ తెలంగాణకు చెందిన సమాజ సేవకురాలు, రచయిత్రి,[1][2] ఈమె భారతదేశంలోని మురికివాడల్లో చేసిన కృషికి పేరుపొందినాడు.[3] ఈమె అనేక వ్యాసాలు, ఐదు పుస్తకాలు వ్రాసింది. అందులో ఎషెన్షియల్ ఆంధ్రా కుక్‌బుక్,[4] ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫర్‌గాటన్ యియర్స్, ది లాడర్ ఆఫ్ హిజ్ లైఫ్ : బయోగ్రఫీ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ లతీఫ్ ఉన్నాయి.[5] ఈమె చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ, 2009లో భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[6]
బిల్కీస్ లతీఫ్, హైదరాబాదులోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి హైదరాబాదీ రాజకుటుంబీకుడైన అలీ యావర్ జంగ్. ఈమె తల్లి ఆలిస్ ఈఫ్రిగ్ అనే ఫ్రెంచి వనిత. అలీ యావర్ జంగ్ దౌత్యవేత్త, విద్యావేత్త. ఈయన ఉస్మానియా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలకు ఉపసంచాలకుడిగా పనిచేశాడు. అర్జెంటీనా, ఈజిప్ట్, యుగోస్లావియా, గ్రీస్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు భారత రాయబారిగా పనిచేశాడు. అంతేకాక మహారాష్ట్ర గవర్నరుగా కూడా ఉన్నాడు.[7]
ఈమె భర్త ఐ.హెచ్.లతీఫ్, భారతదేశపు పదవ ఎయిర్ చీఫ్ మార్షల్, మహారాష్ట్ర గవర్నరుగా, ఫ్రాన్స్ కు భారతీయ రాయబారిగా పనిచేశాడు.[8]
ఈమె ప్రపంచలోనే అతి పెద్ద మురికివాడైన బొంబాయిలోని ధారావీ మురికివాడలో పేదవారి అభ్యుదయానికి చేసినకృషికి విశేష గుర్తింపు పొందింది.,[7] అక్కడికి అనుభవాలతో ఈమె "ఓ ధారావీ" అనే పుస్తకం కూడా వ్రాసింది.[9] ఈమె తొలిపుస్తకం ఎషెన్షియల్ ఆంధ్రా కుక్‌బుక్, ఆంధ్రప్రదేశ్ వంటకాలను, వంట పద్ధతిని అధ్యయనం చేసి వ్రాసిన పాకశాస్త్ర గ్రంథం.[4] ఆ తర్వాత రచన ఆమె తన తల్లి జీవితం, తన్న చిన్ననాటి అనుభవాలను గ్రంథీకరిస్తూ వ్రాసిన స్వీయ జీవితచరిత్ర 2010లో ప్రచురితమైన ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫర్‌గాటన్ యియర్స్.[3] అదే సంవత్సరం ఈమె ఫర్‌గాటెన్ (విస్మృత) అనే మరో పుస్తకం ప్రచ్రురించింది.[10] ఇందులో భారత చరిత్రలో ఆరుగురు ప్రసిద్ధ మహిళల జీవితాలను ఆవిష్కరించింది.[9][11] ఈమె చివరి రచన, ది లాడర్ ఆఫ్ హిజ్ లైఫ్, తన భర్త ఐ.హెచ్.లతీఫ్ యొక్క జీవితచరిత్ర. ఇందులో ఆయన వైమానికదళంలో ఉన్న రోజులు, దౌత్యవేత్తగా ఉన్న రోజులు, మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న కాలం గురించి వ్రాసింది.[5]
ముంబైలోని మురికివాడల్లో చేసిన కృషికిగాను 2009లో బిల్కీస్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నది.[6]
బిల్కిస్ లతీఫ్, 2017, అక్టోబరు 27న 86 యేళ్ల వయసులో, క్యాన్సర్తో పోరాడుతూ మరణించింది.[12] ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.[13]