వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | బ్రెన్ట్ ఫ్రేజర్ బౌడెన్ |
పుట్టిన తేదీ | హెండర్‌సన్, న్యూజీలాండ్ | 1963 ఏప్రిల్ 11
పాత్ర | అంపైర్ |
అంపైరుగా | |
అంపైరింగు చేసిన టెస్టులు | 84 (2000–2015) |
అంపైరింగు చేసిన వన్‌డేలు | 200 (1995–2016) |
అంపైరింగు చేసిన టి20Is | 24 (2005–2016) |
అంపైరింగు చేసిన మటెస్టులు | 1 (1995) |
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 21 (1995–2021) |
అంపైరింగు చేసిన మటి20Is | 25 (2009–2020) |
మూలం: ESPNcricinfo, 2021 డిసెంబర్ 21 |
బ్రెంట్ ఫ్రేజర్ " బిల్లీ " బౌడెన్ (జననం 1963 జనవరి) న్యూజిలాండ్‌కి చెందిన క్రికెట్ అంపైర్ . మొదట్లో క్రికెట్ ఆటగాడిగానే కెరీర్ ప్రారంభించినా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా అది మానుకుని అంపైర్ అయ్యాడు. అతను అంపైర్‌గా నాటకీయమైన పద్ధతిలో సిగ్నలింగ్ ఇచ్చే అలవాటుతో ప్రసిద్ధి చెందాడు, ఇందులో "క్రూకెడ్ ఫింగర్ ఆఫ్ డూమ్" అవుట్ సిగ్నల్ మరీ ప్రసిద్ధి చెందింది.[1] 2016 ఫిబ్రవరి 6న వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌కీ ఆస్ట్రేలియాకీ మధ్య జరిగిన మ్యాచ్ బౌడెన్‌కి 200వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్.[2]
బౌడెన్ న్యూజీలాండ్ ఉత్తర ద్వీపంలో అతి పెద్ద నగరమైన ఆక్లాండ్ శివారులోని హెండర్సన్‌లో జన్మించాడు.
1995 మార్చిలో, బౌడెన్ న్యూజిలాండ్‌కీ, శ్రీలంకకి మధ్య హామిల్టన్‌లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ అతనికి అధికారికంగా అంపైర్‌గా తొలి మ్యాచ్. 2000 మార్చిలో టెస్ట్ మ్యాచ్‌కి ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించడంతో టెస్టుల్లో అంపైర్‌గా కెరీర్ ప్రారంభమైంది. 2002లో అంతర్జాతీయ అంపైర్ల ఎమిరేట్స్ ప్యానెల్‌లో అతన్ని చేర్చారు. ఒక సంవత్సరం తర్వాత అతనికి దక్షిణాఫ్రికాలో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో అంపైరింగ్ చేసే అవకాశం లభించింది. ఆస్ట్రేలియాకీ, భారతదేశానికీ మధ్య జరిగిన ఫైనల్‌లో నాలుగో అంపైర్‌గా ఎంపికయ్యాడు. దీని తర్వాత కొంతకాలానికి అతను ICC అంపైర్ల ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి పొందాడు. అందులో 2013 వరకు అతను సభ్యునిగా కొనసాగాడు. అతను 2007 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో నాల్గవ అంపైర్‌గా మళ్ళీ వ్యవహరించాడు.[3]
2006లో బ్రిస్బేన్‌లో జరిగిన యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో లెగ్ అంపైర్‌గా వ్యవహరించినప్పుడు గెరైంట్ జోన్స్ కొట్టిన బంతికి దెబ్బతిని నేలమీద పడిపోయాడు.[4]
అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన ఇరవై మంది అంపైర్లలో ఒకడిగా ఎంపికయ్యాడు.[5] 2016 జూన్ వరకు అంతర్జాతీయ అంపైర్లు, రిఫరీల ప్యానెల్‌లో సభ్యునిగా కొనసాగి, ఆ తర్వాత న్యూజిలాండ్ జాతీయ ప్యానెల్‌కు డిమోట్ అయ్యాడు.[6]
2020 డిసెంబరు 24న, అతను వెల్లింగ్‌టన్ ఫైర్‌బర్డ్స్‌కి, ఆక్లాండ్ ఏసెస్‌కి మధ్య ప్రారంభమైన డ్రీమ్ 11 దేశీయ T20 పోటీకి అంపైర్‌గా పనిచేసాడు. ఇందులో పురుష క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. 2023 నాటికి అతను సూపర్ స్మాష్ టీ20 మహిళల పోటీలో అంపైరింగ్ చేస్తున్నాడు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న బౌడెన్‌కు సంప్రదాయ పద్ధతిలో బ్యాటర్లు ఔట్ అయినప్పుడు వేలెత్తి సిగ్నల్ ఇవ్వడం చాలా బాధాకరమైనది, [7] అందువల్ల చూపుడు వేలిని పైకి లేపి వంకరగా చూపే పద్ధతి అలవరుచుకున్నాడు. ఇదే "వంకరగా ఉన్న డూమ్"గా ప్రసిద్ధి చెందింది. ఇదే కాక మిగిలిన సిగ్నల్స్ విషయంలో తనదైన పద్ధతి అనుసరించి ఆసక్తి సృష్టించాడు. ఇందులో "క్రంబ్-స్వీపింగ్" అన్న పద్ధతిలో చేతిని వేవ్ చేసే బౌండరీ సిగ్నల్, "డబుల్ క్రోక్డ్ ఫింగర్ సిక్స్-ఫేజ్ హాప్" ద్వారా సిక్స్ సంకేతం ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లలో అతని సిగ్నల్స్ ప్రశాంతంగా, హుందాగా ఉంటే, వన్డేల్లో తమాషాగానూ, టీ20లో మరింత ఆకర్షణీయంగానూ ఉంటాయి. అతని ప్రవర్తన వల్ల అతనికి అభిమానులూ, విమర్శకులూ కూడా ఏర్పడ్డారు. కామెంటేటర్, న్యూజీలాండ్ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవ్ బిల్లీని గురించి బోజో ది క్లౌన్ అని వ్యాఖ్యానించాడు.[7] మరో వ్యాఖ్యాత మాట్లాడుతూ "క్రికెట్ అన్నది ఆటగాళ్ళ కోసం, అభిమానుల కోసం ఉంది తప్ప అంపైర్ల కోసం కాదని (బిల్లీ) గుర్తుంచుకోవాలని" అన్నాడు.[8] అయితే, ఆర్థరైటిస్ కారణంగా బాడీ ఫ్లూయిడ్స్ ఉంచుకోవాల్సి వచ్చినందువల్ల అలా సిగ్నల్స్ ఇస్తాడనీ, అలాంటప్పుడు తన పద్ధతిలోనే తాను సిగ్నల్ చేయడమే మంచిదనీ మరికొందరు సూచిస్తారు.[7]