బిశ్వభూషన్ హరిచందన్ | |
---|---|
![]() 2019లో హరిచందన్ | |
7వ ఛత్తీస్‌గఢ్ గవర్నర్ | |
In office 2023 ఫిబ్రవరి 23 [1] – 2024 జులై 29 | |
ముఖ్యమంత్రి | భూపేష్ బాఘేల్ విష్ణుదేవ్ సాయ్ |
అంతకు ముందు వారు | అనసూయ ఉయికీ |
తరువాత వారు | రామెన్ దేక |
23వ ఆంధ్రప్రదేశ్ గవర్నరు | |
In office 2019 జులై 24 – 2023 ఫిబ్రవరి 22 | |
ముఖ్యమంత్రి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి |
అంతకు ముందు వారు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
తరువాత వారు | ఎస్. అబ్దుల్ నజీర్ |
ఒడిశా శాసనసభ సభ్యుడు | |
In office 1997–2009 | |
నియోజకవర్గం | భువనేశ్వర్ సెంట్రల్ |
In office 1990–1995 | |
నియోజకవర్గం | చిలికా |
లా, రెవెన్యూ, ఫిషరీస్ కేబినెట్ మంత్రి ఒడిశా ప్రభుత్వం | |
In office 2004–2009 | |
In office 1977–1980 | |
నియోజకవర్గం | చిలికా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 3 ఆగస్టు 1934 |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | సుప్రవ హరిచందన్ |
సంతానం | పృథ్వీరాజ్ హరిచందన్ (కొడుకు) |
వృత్తి |
|
పురస్కారాలు | కళింగ రత్న అవార్డు, 2021 |
బిశ్వభూషణ్ హరిచందన్ (జననం 3 ఆగస్టు 1934)[2] ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు, న్యాయవాది, కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడు. అతను 2019 జూలై 17 నుండి 2023 ఫిబ్రవరి 12 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా[3] ఛత్తీస్‌గఢ్ 7వ గవర్నర్‌గా 2023 ఫిబ్రవరి 23 నుండి 2024 జులై 30 వరకు పనిచేశారు.[4]
2004 నుండి 2009 వరకు, అతను ఒడిశా ప్రభుత్వంలో చట్టం, రెవెన్యూ మరియు మత్స్య శాఖ మంత్రిగా పనిచేశాడు.
అతను ఒడీశాలోని ఖుర్దాకు చెందినవాడు. అతను 1934 ఆగస్టు 3న జన్మించాడు. అతనికి జనసంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఒడిశాలో ‘సంఘ్’ కార్యకలాపాలు విస్తరించేందుకు అతను 1964లో అక్కడ భారతీయ జనసంఘ్ శాఖను ఏర్పరిచాడు. స్వయం సేవకుడుగా ఉన్న అతను జనసంఘ్ లో చేరి చురుకుగా పనిచేశాడు.
జనసంఘ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్లాడు. 1977లో జన్‌సంఘ్ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో హరిచందన్ ఒకరు. ఇప్పటిదాకా రెండుసార్లు జనతా పార్టీ టికెట్‌పై, మూడుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు.
రెవెన్యూ, న్యాయ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1980 నుంచి ఎనిమిదేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1996లో ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చేశాడు.
1977 ఒడీశా అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[5] 1990 అసెంబ్లీ ఎన్నికలలో చిలికా శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ పార్టీ తరపున పోటీ చెసి రెండవసారి శాసనసభ్యునిగా ఎంపిక కాబడ్డాడు.[6]
2000 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[7] 2004 అసెంబ్లీ ఎన్నికలలో భువనేశ్వర్ శాసనసభ నియోకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[8]
అతను బి.జె.పి-జె.డియు సంకీర్ణ ప్రభుత్వంలో న్యాయ, రెవెన్యూ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. అతను 1971లో భారతీయ జనస్ంఘ్ లో చేరి 1977లో జనతా పార్టీ పారంభమయ్యే వరకు జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలను నిర్వహించాడు.[9]
ఇతను సుదీర్ఘకాలంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో అనుబంధం కలిగివున్నాడు. 1988 నుంచి భారతీయ జనతా పార్టీ లో క్రియాశీలంగా ఉంటూ రచయితగా పలు పుస్తకాలు రాశాడు. అవినీతిపై పోరు, మొక్కల పెంపకంపై ఇతడికి ఆసక్తి ఉంది.[10]
పూరీలోని జగన్నాథ మందిరంలో అనేక సంస్కరణలను చేపట్టాడు. ఆలయం మార్గంలోను, ఆలయంలోనూ మరణించిన భక్తులకు, పూజారులకు బీమా సౌకర్యం కల్పించడం, ఆలయం చుట్టూ సరిహద్దు గోడ నిర్మించడం వంటి చర్యలు తీసుకున్నాడు.
ఏకాంకికలు రచించే అతను ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాశాడు. మరు బటాస్, రాణా ప్రతాప్, శేష ఝలక్, అస్తా సిఖండ్ మానసి వంటి పుస్తకాలను ఒరియా భాషలో రాసాడు[11].