బిషంబర్ సింగ్ వాల్మీకి | |||
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | రాంకిషన్ ఫౌజీ | ||
---|---|---|---|
తరువాత | కపూర్ సింగ్ వాల్మీకి | ||
నియోజకవర్గం | బవానీ ఖేరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బిషంబర్ సింగ్ వాల్మీకి (జననం 8 నవంబర్ 1969) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బవానీ ఖేరా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బిషంబర్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బవానీ ఖేరా నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి దయా భూర్తనపై 2,559 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంకిషన్ ఫౌజీపై 10,895 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఆయన 19 మార్చి 2024 నుండి సెప్టెంబర్ 5 వరకు నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పని చేసి,[3][4] 2024 ఎన్నికలలో టికెట్ దక్కకపోవడంతో 2024 సెప్టెంబర్ 05న బీజేపీకి రాజీనామా చేశాడు.[5]