బిషన్ నారాయణ్ దార్

పండిట్ బిషన్ నారాయణ్ దార్, (1864 -1916 నవంబరు 19) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అతను 1911లో ఒకసారి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు.దార్ లక్నో లోని ప్రముఖ కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు. అతని మామ పండిట్ శంభునాథ్ కలకత్తా హైకోర్టు మొదటి భారతీయ న్యాయమూర్తి. దార్, లాహోర్‌ లోని చర్చ్ మిషన్ ఉన్నత పాఠశాల, క్యానింగ్ కళాశాలలో చదువుకున్నాడు. [1]

దార్ న్యాయవాది వృత్తికోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడ అతను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.1911లో అతను యునైటెడ్ ప్రొవిన్షియల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా అదే సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1914లో, అతను యునైటెడ్ ప్రావిన్సుల నుండి సామ్రాజ్య శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Indian Biographical Dictionary. 1915.