వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | అశుతోష్ అమన్ |
కోచ్ | Pawan Kumar |
యజమాని | బీహార్ క్రికెట్ సంఘం |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1936 |
స్వంత మైదానం | రాజాగిర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, నలంద |
సామర్థ్యం | 45,000 |
రెండవ స్వంత మైదానం | మొయిన్ ఉల్ హక్ స్టేడియం |
రెండవ మైదాన సామర్థ్యం | 25,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
బీహార్ క్రికెట్ జట్టు భారత దేశవాళీ క్రికెట్ పోటీలలో బీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని బీహార్ క్రికెట్ సంఘం నిర్వహిస్తోంది.
ఈ జట్టు 1936-37 నుండి 2003-04 వరకు రంజీ ట్రోఫీలో పోటీపడింది. బీహార్ రాష్ట్రాన్ని బీహార్, జార్ఖండ్ లుగా విభజించినప్పుడు, రాష్ట్ర క్రికెట్ మౌలిక సదుపాయాలు చాలా వరకు జార్ఖండ్‌లో ఉన్నాయి, కాబట్టి జార్ఖండ్ జట్టుగా రంజీ ట్రోఫీలో ఆడటం ప్రారంభించింది. ఇక బీహార్ రాష్ట్రం కొంతకాలం ప్రాతినిధ్యం వహించలేదు. [1] [2] ఈ విభజనకు ముందు బీహార్ 236 మొదటి తరగతి క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది, 78 గెలిచింది, 56 ఓడిపోయింది[3]
1975-76లో బీహార్ జట్టు రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. రంజీ ట్రోఫీలో దల్జీత్ సింగ్ జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. అయితే జట్టు రన్నర్ అప్ గా నిలచింది.
ఏప్రిల్ 2018లో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా-BCCI) బీహార్ జట్టును పునరుద్ధరించింది. [4] [5] 19 సెప్టెంబరు 2018న,ఈ జట్టు 2018–19 విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది.[6][7] 2018–19 రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు
8 అక్టోబరు 2018న, విజయ్ హజారే ట్రోఫీ 2018-19 కోసం బీహార్ 9 వికెట్ల తేడాతో మిజోరం జట్టు ను ఓడించి, క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. [8] [9] ఇక్కడ ముంబై జట్టు బీహార్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించిది. [10] [11]
నవంబరు 2018లో, 2018-19 రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో, ఉత్తరాఖండ్‌తో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. [12] [13] అయితే తమ 8 మ్యాచ్‌లలో 6 గెలిచిన ఫలితముగా 2018–19 టోర్నమెంట్ పట్టికలో బీహార్ జట్టు రెండవ స్థానంలో ఉంది.[14]
మార్చి 2019లో, బీహార్ జట్టు తమ ఆరు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ B లో ఆరో స్థానంలో నిలిచింది. [15] పోటీలో కేశవ్ కుమార్ 145 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగుల తీసాడు. ఇంకా అశుతోష్ అమన్ ఏడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. [16]
29 జనవరి 2023న, 2022-23 రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్‌లో బీహార్ మణిపూర్‌ను 220 పరుగుల తేడాతో ఓడించింది. [17]
పేరు | నగరం | రాష్ట్రం | మొదట
ఉపయోగించబడింది |
చివరగా
ఉపయోగించింది |
గమనికలు |
---|---|---|---|---|---|
నలంద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | రాజ్‌గిర్ | బీహార్ | 2022 | - | బీహార్‌లోని రాబోయే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం |
మొయిన్-ఉల్-హక్ స్టేడియం | పాట్నా | బీహార్ | 1970 | 2023 | హోమ్ గ్రౌండ్, మూడు వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది |
నెహ్రూ స్మారక్ స్టేడియం | భాగల్పూర్ | బీహార్ | 1972 | 1973 | |
శాండీస్ కాంపౌండ్ ఎన్‌క్లోజర్ | భాగల్పూర్ | బీహార్ | 1981 | 1981 | |
డా. నాగేంద్ర ఝా స్టేడియం | దర్భంగా | బీహార్ | 1986 | 1998 | |
ఉర్జా స్టేడియం | పాట్నా | బీహార్ | 2017 | 2021 |
పేరు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | వివరాలు |
---|---|---|---|---|
బ్యాట్స్ మెన్ | ||||
సకీబుల్ గని | 1999 సెప్టెంబరు 2 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
బాబుల్ కుమార్ | 1993 జనవరి 12 | కుడిచేతి వాటం | Vice-Captain | |
మంగళ్ మహరూర్ | 1992 ఏప్రిల్ 1 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
రిషవ్ రాజ్ | 1996 ఫిబ్రవరి 3 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
శివమ్ సింగ్ | 1996 నవంబరు 18 | కుడిచేతి వాటం | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | |
సూర్య వంశ్ | 2000 మార్చి 9 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
శిశిర్ సాకేత్ | 2000 ఏప్రిల్ 10 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
పీయూష్ సింగ్ | 2001 మే 4 | కుడిచేతి వాటం | కుడి చేతి ఆఫ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
సచిన్ కుమార్ | 1997 డిసెంబరు 25 | ఎడమ చేతి వాటం | Slow left arm orthodox | |
రఘువేంద్ర ప్రతాప్ | 2003 ఆగస్టు 1 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం /ఫాస్ట్ | |
అనుజ్ రాజ్ | 2000 నవంబరు 1 | కుడిచేతి వాటం | ఎడమ చేతి మీడియం | |
వికెట్ కీపర్స్ | ||||
బిపిన్ సౌరభ్ | 1999 నవంబరు 20 | కుడిచేతి వాటం | ||
వికాస్ రంజన్ | 1994 ఫిబ్రవరి 15 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
అశుతోష్ అమన్ | 1986 మే 19 | కుడిచేతి వాటం | ఎడమ చేతి స్లో /ఆర్థోడాక్స్ | Captain |
శివం కుమార్ | 2000 ఆగస్టు 7 | కుడిచేతి వాటం | కుడి చేతి లెగ్ బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
హర్ష్ సింగ్ | 1995 సెప్టెంబరు 20 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
వీర్ ప్రతాప్ సింగ్ | 1992 మే 3 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
అభిజీత్ సాకేత్ | 1995 ఆగస్టు 3 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
మలయ్ రాజ్ | 2003 మార్చి 11 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
అనునయ్ సింగ్ | 1993 జనవరి 3 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం | |
సాకిబ్ హుస్సేన్ | 2004 డిసెంబరు 14 | కుడిచేతి వాటం | కుడి చేతి మీడియం |