బెంగాల్ టైగర్ | |
---|---|
దర్శకత్వం | సంపత్ నంది |
రచన | సంపత్ నంది |
స్క్రీన్ ప్లే | సంపత్ నంది |
కథ | సంపత్ నంది |
నిర్మాత | కె.కె.రాధామోహన్ |
తారాగణం | రవితేజ (నటుడు) తమన్నా రాశి ఖన్నా బొమన్ ఇరానీ |
ఛాయాగ్రహణం | సౌందరరాజన్ |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | భీమ్స్ సెసిరోలియో |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 10 డిసెంబరు 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹250 మిలియను (US$3.1 million)[1] |
శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకం పై కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, తమన్నా ముఖ్య పాత్రలు పొషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబరు 10 2015 న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.
ఆకాష్ నారాయణ్ (రవితేజ) ఆత్రేయపురంలో ఆవారాగా తిరిగే కుర్రాడు. ఎన్నాళ్లిలా తిరుగుతావంటూ ఇంట్లో వాళ్లు అతనికి పెళ్ళి చేసేందుకు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఒక సంబంధం కోసం పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. తీరా చూస్తే.. ఆ అమ్మాయి (అక్ష) నువ్వు నాకు నచ్చలేదు.. నేను పెళ్ళి అంటూ చేసుకుంటే సెలబ్రిటీనే చేసుకుంటా.. అంటుంది. దీంతో ఆకాష్‌నారాయణ్ అహం దెబ్బతింటుంది. ఎలాగైనా తానో సెలబ్రిటీ అయిపోవాలని నిర్ణయించుకుంటాడు.
ఆ లక్ష్యంతో.. వూరికి వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి సాంబు (సాయాజీ షిండే)పై రాయి విసిరి మీడియా దృష్టిని ఆకర్షిస్తాడు. దీంతో.. ఆకాష్ జైలు కెళ్లినా.. అతని పేరు మాత్రం మార్మోగిపోతుంది. మరోవైపు తనపై రాయివిసిరిన ఆకాష్ గురించి తెలిసి మంత్రి సాంబు జైలుకు వెళ్లి అతనితో మాట్లాడతాడు. అతను చెప్పే తిక్కతిక్క సమాధానాలు ఆ మంత్రికి ఎంతగానో నచ్చుతాయి. ఇరవయ్యేళ్ల క్రితం తనను గుర్తుకు తెస్తున్నాడంటూ మెచ్చుకొని తనతో తీసుకెళ్తాడు.
అక్కడి నుంచి ఆకాష్... హోంమంత్రి నాగప్ప (రావు రమేష్), అతని కూతురు శ్రద్ధ (రాశి ఖన్నా)కీ, ముఖ్యమంత్రి అశోక్ గజపతి (బొమన్ ఇరానీ)కి, ఆయన కూతురు మీరా (తమన్నా)కీ ఎలా దగ్గరయ్యాడు? వాళ్లకీ ఇతనికీ ఏమిటి సంబంధం? తదితర అంశాలన్నీ మిగిలిన కథ.