ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బెంగళూర్ డేస్ | |
---|---|
దస్త్రం:'Bangalore Days' 2014 Malayalam Film - Poster.jpg | |
దర్శకత్వం | అంజలీ మీనన్ |
రచన | అంజలీ మీనన్ |
నిర్మాత | అన్వర్ రషీద్ సోఫియా పాల్ |
తారాగణం | |
ఫైట్స్ | జాలీ బాస్టియన్ |
Narrated by | నివిన్ పౌలీ |
ఛాయాగ్రహణం | సమీర్ తాహిర్ |
కూర్పు | ప్రవీణ్ ప్రభాకర్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 30 మే 2014 | (Kerala)
సినిమా నిడివి | 172 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బెంగుళూరు డేస్ (ఆంగ్లం: Bangalore Days) 2014 లో విడుదల అయిన ఒక మలయాళం సినిమా. ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ, ఇషా తల్వార్ నిత్యా మీనన్ ఈ చిత్రం ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకురాలు అంజలీ మీనన్, ఈ చిత్రం లో కూడా కేరళ నుండి బెంగుళూరు కి వెళ్ళిన ముగ్గురి దాయాదుల కథ చెప్పారు.
2016 లో ఇదే చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తమిళం లో బెంగుళూరు నాట్గళ్ గా పునర్నిర్మించటం విశేషం.
ముగ్గురు దాయాదులు అయిన దివ్యా ప్రకాష్ అలియాస్ కుంజు (నజ్రియా నజీం), కృష్ణన్ పి.పి అలియాస్ కుట్టన్ (నివిన్ పౌలీ) అర్జున్ అలియాస్ అజు (దుల్కర్ సల్మాన్) చిన్నప్పటి నుండి ఒకరిపై మరొకరు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. విడాకులు తీసుకొన్న తల్లిదండ్రులకు దూరంగా అజు బెంగుళూరు మహానగరంలో బైక్ మెకానిక్ గా తనదైన జీవనశైలి లో జీవిస్తూ ఉంటాడు. కుట్టన్ కు బెంగుళూరులోనే సాఫ్టువేరు ఉద్యోగం దొరుకుతుంది. వృత్తిరిత్యా మహానగరంలో ఉన్నా, కుట్టన్ మనసు మాత్రం స్వగ్రామంలోనే ఉంటుంది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన కుంజు ఆశయం ఐ ఐ ఎం లో ఎం బి ఏ చదవాలని, కానీ తన తల్లిదండ్రులు నమ్మే జ్యోతిష్యుని సలహా మేరకు వృత్తి తప్పితే వేరే ధ్యాస లేని దాస్ (ఫహద్ ఫాజిల్) తో వివాహం నిశ్చయం అవుతుంది. పెళ్ళి చూపుల్లోనే దాస్ తనకు అది వరకే ఒక ప్రేమ వ్యవహారం ఉండేది అని, కానీ ఇప్పుడు అదంతా గతం అని అంజు కు ముఖం పైనే చెప్పేస్తాడు. దాస్ బెంగుళూరు లోనే ఉద్యోగం చేస్తూ ఉండటం తో కుంజు కూడా బెంగుళూరు చేరుకొంటుంది.
దాస్ ముభావంగానే ఉండటంతో కుంజు ఒంటరితనానికి లోను అవుతుంది. తనకి ఈ ఒంటరితనానికి ఉన్న ఒకే ఒక ఆటవిడుపు తన దాయాదులతో గడిపే సమయం. అమాయకపు చక్రవర్తి అయిన కుట్టన్ సాంప్రదాయబద్ధంగా, నమ్రతగా ఉండే అమ్మాయి తనకు భార్యగా రావాలి అని కలలు గంటూ ఉంటాడు. అయితే బెంగుళూరు నుండి కొచ్చి వెళ్ళే విమానం లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న మీనాక్షి (ఇషా తల్వార్) తో ప్రేమలో పడతాడు. మీనాక్షి ని తరచుగా కలుస్తూ, సిగ్గరి గా ఉన్న కుట్టన్ మారిపోతాడు. అయితే ఒక రోజు మీనాక్షి ఫ్లాట్ కు ఆమె పూర్వ ప్రేమికుడు రావటంతో మీనాక్షి తనను కేవలం అతనిని మరచిపోవటానికి ఒక పావుగా వాడుకొంటున్నట్లు తెలుసుకొని ఆమె తో తెగదెంపులు చేస్కొంటాడు.
ఒక వైపు కుంజు, దాస్ ల వైవాహిక జీవితం ముక్కలు చెక్కలు అవుతూ ఉంటుంది. ఒక రోజు జరిగిన వాగ్వాదం తర్వాత దాస్ వద్ద మాత్రం ఉండే ఒక తాళం చెవితో ఆ ఇంట్లోని ఒక గది లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నటాషా ఫ్రాన్సిస్ (నిత్యా మీనన్) ఫోటోలు, ఆమెకు చెందిన వస్తువులు చూసి ఆశ్చర్యానికి గురౌతుంది. దాస్ హృదయంలో తనకు ఎంత మాత్రం చోటు లేదని గ్రహించిన అంజు, కుట్టన్ తో బాటు ప్రయాణం అయ్యి పుట్టింటికి చేరుకొంటుంది. అయితే అప్పటికే కుట్టన్ తండ్రి తన్ ఆస్తిపాస్తులను మొత్త్ం కుట్టన్ అతని సోదరికి వీలునామా వ్రాసి శాశ్వత తీర్థయాత్ర లకు వెళ్ళి పోవడం తో కుట్టన్ కూడా బాధాకర పరిస్థితులలోకి నెట్టి వేయబడతాడు. తల్లి కోరడం తో కుట్టన్ ఆవిడ ను కూడా బెంగుళూరు తీసుకొని వస్తాడు.
అజు ఒక బైక్ రేసింగ్ గ్యాంగ్ లో చేరి వారి బైకు లను రిపేర్లు చేస్తూ ఉంటాడు. రేడియో జాకీ అయిన సారా (పార్వతి తిరువోతు) ను ప్రేమించటం మొదలు పెడతాడు. ఆమెను చూడటానికి రేడియో స్టేషనుకు వెళ్ళగా, ఆమె (కాళ్ళు పని చేయకపోవటమ్ వలన) వీల్ చెయిర్ ను వాడటం చూస్తాడు. మొదట ఇరువురూ సంశయించినా, స్నేహితులు అయ్యాక ప్రేమలో పడతారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించటానికి సారా ఆస్ట్రేలియా వెళ్తోందని తెలిసి అజు నిరాశ చెందుతాడు.
కుంజు, దాస్ లు విడాకులకు సిద్ధం అవుతుండగా, తాను చేరిన బైక్ రేసర్ల గ్యాంగ్ లో అందరూ ఎప్పుడూ మాట్లాడుకొనే అద్భుతమైన రేసర్ శివ యే దాస్ అని, అతని పూర్తి పేరు శివదాస్ అని, అతను నటాషా ఒకరినొకరు ప్రేమించుకొన్నారని, అయితే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నియమాన్ని ఉల్లంఘించటం వలన జరిగిన రోడ్డు ప్రమాదంలో శివదాస్, నటాషాను కోల్పోయాడని, ఆమె మరణం తర్వాత శివదాస్ ఏమైపోయాడో బైకర్లు ఎవరికీ తెలియదు అని తెలుసుకొంటాడు. ఈ విషయాన్ని అజు కుంజుకు తెలుపగా, కుంజు దాస్ వద్దకు తిరిగి వచ్చి అతని తోనే ఉంటూ ఎం బీ ఏ చదువుతూ ఉంటుంది. కుంజు నటాషా తల్లిదండ్రులను కలిసి దాస్ పై వారికి ఉన్న అపార్థాలను తొలగించి వేస్తుంది. దాని తర్వాత దాస్ గతాన్ని మరచిపోవటం, కుంజు కు దగ్గర అవ్వటం తో వారి వైవాహిక జీవితం గాడిన పడుతుంది.
కుట్టన్ తల్లి బెంగుళూరులో పూర్తి నాగరికతకు అలవాటు పడిపోతుంది. కుట్టన్ సోదరి అమెరికా లోని ఓక్లహామా లో ఉండటం తో తను కూడా అక్కడికే బయలుదేరుతుంది. విమానాశ్రయం లో మీనాక్షి తారసపడుతుంది. మీనాక్షి కుట్టన్ ను మరల కోరుకొన్నా, కుట్టన్ ఆమెను నిరాకరిస్తాడు.
సారా ఆస్ట్రేలియా ప్రయాణం అయ్యే రోజునే, బైకర్స్ గ్యాంగ్ తరఫున అజు పోటీ చేసి, పందెం లో మొదటి స్థానం లో గెలుస్తాడు. కుంజు, కుట్టన్, (శివ)దాస్ లు అజు మనసులో సారా యే ఉందని తెలుసుకొంటారు. (మితిమీరిన వేగం వలనే నటాషాను కోల్పోయాడు కాబట్టి) అప్పటి వరకు కారును చాలా నెమ్మదిగా నడిపే శివదాస్, తన డ్రైవింగ్ నైపుణ్యంతో వేగంగా అజును సారా ఇంటికి చేరుస్తాడు. తన కోసం వచ్చిన అజును చూడగనే సారా తన ఆస్ట్రేలియా ప్రయాణాన్ని రద్దు చేసుకొంటుంది. భరతనాట్యం అభ్యసిస్తున్న పాశ్చాత్య యువతి మిచెల్లీ ను కుట్టన్ వివాహం చేసుకోవటం తో కథ ముగుస్తుంది.
Award | Date of ceremony[a] | Category | Recipient(s) | Result | Ref. |
---|---|---|---|---|---|
Asianet Film Awards | 11 January 2015 | Best Popular film | Bangalore Days | గెలుపు | [1] |
Best Director | Anjali Menon | గెలుపు | |||
Star of The Year | Dulquer Salmaan | గెలుపు | |||
Performer of The Year | Fahadh Faasil | గెలుపు | |||
Best Supporting Actress | Parvathy Thiruvothu | గెలుపు | |||
Best Music Director | Gopi Sundar | గెలుపు | |||
Best Lyricist | Rafeeq Ahamed ("Ethu Kari Raavilum") | గెలుపు | |||
Best Male Playback Singer | Haricharan ("Ethu Kari Raavilum") | గెలుపు | |||
Asiavision Awards | 14 November 2014 | Best Entertaining Movie | Bangalore Days (Anjali Menon) | గెలుపు | [2] |
Performer of The Year - Male | Dulquer Salmaan | గెలుపు | |||
Star of The Year – Male | Nivin Pauly | గెలుపు | |||
Star of the Year - Female | Nazriya Nazim | గెలుపు | |||
New Sensation in Acting | Parvathy Thiruvothu | గెలుపు | |||
Best Music Director | Gopi Sundar | గెలుపు | |||
Best Cinematographer | Sameer Thahir | గెలుపు | |||
Filmfare Awards South | 26 June 2015 | Best Film – Malayalam | Bangalore Days | ప్రతిపాదించబడింది | [3] [4] |
Best Director – Malayalam | Anjali Menon | గెలుపు | |||
Best Supporting Actor – Malayalam | Fahadh Faasil | ప్రతిపాదించబడింది | |||
Best Supporting Actress – Malayalam | Parvathy Thiruvothu | గెలుపు | |||
Best Music Director – Malayalam | Gopi Sundar | గెలుపు | |||
Best Male Playback Singer – Malayalam | Haricharan ("Ethu Kari Raavilum") | గెలుపు | |||
Vijay Yesudas & Sachin Warrier ("Thudakkam Mangalyam") | ప్రతిపాదించబడింది | ||||
Kerala State Film Awards | 10 August 2015 | Best Actor | Nivin Pauly | గెలుపు | [5] |
Best Actress | Nazriya Nazim | గెలుపు | |||
Best Screenplay (Original) | Anjali Menon | గెలుపు | |||
South Indian International Movie Awards | 6—7 August 2015 | Best Film – Malayalam | Bangalore Days | గెలుపు | [6] [7] |
Best Debut Producer – Malayalam | Anwar Rasheed & Sophia Paul | గెలుపు | |||
Best Director – Malayalam | Anjali Menon | గెలుపు | |||
Best Cinematographer – Malayalam | Sameer Thahir | ప్రతిపాదించబడింది | |||
Best Supporting Actress – Malayalam | Parvathy Thiruvothu | గెలుపు | |||
Best Music Director – Malayalam | Gopi Sundar | గెలుపు | |||
Best Lyricist – Malayalam | Rafeeq Ahamed ("Ethu Kari Raavilum") | ప్రతిపాదించబడింది | |||
Best Male Playback Singer – Malayalam | Haricharan ("Ethu Kari Raavilum") | ప్రతిపాదించబడింది | |||
Best Dance Choreographer – Malayalam | Brinda ("Thudakkam Mangalyam") | ప్రతిపాదించబడింది | |||
Vanitha Film Awards | 15 February 2015 | Most Popular Actress | Nazriya Nazim | గెలుపు | [8] |
Popular Song of the Year | "Mangalyam Thanthunanena" | గెలుపు |