![]() 1951 లో బెట్టీ విల్సన్ | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బెట్టీ రెబెకా విల్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మెల్బోర్న్, ఆస్ట్రేలియా | 1921 నవంబరు 21|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 22 జనవరి 2010 మెల్బోర్న్, ఆస్ట్రేలియా | (aged 88)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి ఆఫ్ స్పిన్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 25) | 1948 20 మార్చ్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1958 24 మార్చ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1937/38–1957/58 | విక్టోరియా జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 జనవరి 13 |
బెట్టీ విల్సన్ ఆస్ట్రేలియా మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమెను ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడింది.[1][2][3] ఆమె 1947-48, 1957-58 మధ్య మహిళల టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. విల్సన్ కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్ గా, మంచి ఆఫ్ స్పిన్ బౌలర్ గా, అద్భుతమైన ఫీల్డర్ గా రాణించింది.
మెల్ బోర్న్ లో 1921 నవంబరు 21న జన్మించిన విల్సన్ కాలింగ్ వుడ్ పరిసరాల్లో పెరిగింది. ఆమె వీధిలో ఒక దీపస్తంభంతో ఆడటం ద్వారా ఆట నేర్చుకుంది. 10 సంవత్సరాల వయస్సులో ఆమె కాలింగ్ వుడ్ ఉమెన్స్ క్రికెట్ క్లబ్లో చేరింది, అక్కడ ఆమె పెద్దవాళ్ళతో కలిసి ఆడింది. ఆమె 14 సంవత్సరాల వయస్సులో విక్టోరియా రెండవ XI జట్టుకి, 16 సంవత్సరాల వయస్సులో సీనియర్ జట్టుకు చేరుకుంది. ఆమె పూర్తి పేరు బెట్టీ రెబెక్కా విల్సన్. ఆమె 2010 జనవరి 22 మెల్ బోర్న్ లో నే మరణించింది.
రెండవ ప్రపంచ యుద్ధం వలన 1948 వరకు ఆమె టెస్ట్ మ్యాచ్ లను ఆడలేక పోయింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆమె 90 పరుగులు చేసి, 4/37, 6/28 పరుగులకు వికెట్లు తీసింది. 1949లో తన రెండవ టెస్టులో ఇంగ్లాండ్ పై 111 పరుగులు చేసి శతకము సాధించింది. దీంతో మహిళల టెస్ట్ మ్యాచ్ లో శతకము సాధించి, ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ గా ఆమె పేరు నిలిచింది.[4]
ఆమె 1951లో ఇంగ్లాండ్ పర్యటన చేసి స్కార్ బరోలో జరిగిన మొదటి టెస్టులో 81 పరుగులు చేసింది. యార్క్ షైర్ లో ఆమె 77 నిమిషాల్లో 100 పరుగులు చేసి ఆస్ట్రేలియాను చివరి బంతికి గెలిపించింది. ఈ సిరీస్ తర్వాత ఆమె రెండున్నర సంవత్సరాలు ఇంగ్లాండ్ లో ఉండిపోయింది.
1957 - 58లో ఇంగ్లాండ్ లో జరిగిన సెయింట్ కిల్డా టెస్టులో ఆమె 100 పరుగులు చేసి, 10 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్ (మహిళలు/పురుషులలో) గా ఘనత సాధించింది.[5] తడి వికెట్ పై ఆమె మొదటి ఇన్నింగ్స్ లో 7/7 ను తీసుకుంది. ఇది మహిళల టెస్టులో మొట్టమొదటి హ్యాట్రిక్ కూడా.[6] 2004లో పాకిస్తాన్ కు చెందిన షైజా ఖాన్ ఈ ఘనత సాధించేవరకు ఈ రికార్డ్ పునరావృతం కాలేదు. ఆస్ట్రేలియా మొదటి తక్కువ ఇన్నింగ్స్ లో 12 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 100 పరుగులతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా రెండవ దాంట్లో 19 ఓవర్లకి 4/9 తీసుకొని, ఒక మ్యాచ్ లో 11/16 అత్యుత్తమ బౌలింగ్ చేసిన మరో రికార్డును నెలకొల్పింది. ఇది 2004 వరకు రికార్డుగా నిలిచింది. విల్సన్ తన కెరీర్లో 11 టెస్టులు ఆడి, 57.4 సగటుతో 862 పరుగులు చేసి, 11.8 సగటుతో 68 వికెట్లు తీసింది.
నెం. | పరుగులు. | ప్రత్యర్థులు | నగరం / దేశం | వేదిక | సంవత్సరం. |
---|---|---|---|---|---|
1. | 111 | ![]() |
అడిలైడ్ ఆస్ట్రేలియా | అడిలైడ్ ఓవల్ | 1949[8] |
2. | 100 | ![]() |
మెల్బోర్న్ ఆస్ట్రేలియా | జంక్షన్ ఓవల్ | 1958[9] |
3. | 127 | ![]() |
అడిలైడ్ ఆస్ట్రేలియా | అడిలైడ్ ఓవల్ | 1958[10] |