బెలీజ్‌లో హిందూ మతం మైనారిటీ విశ్వాసం. 2010 జనాభా లెక్కల ప్రకారం, బెలీజ్ జనాభాలో 0.2% హిందువులు . [1]
2000 | 2010 | |||
---|---|---|---|---|
సంఖ్య | % | సంఖ్య | % | |
మొత్తం జనాభా | 232,111 | 304,106 | ||
- హిందూ జనాభా | 367 | 0.2 | 612 | 0.2 |
అయితే, అసోసియేషన్ ఆఫ్ రిలిజియన్ డేటా ఆర్కైవ్స్ ప్రకారం 2005 నాటికి, 2.0% మంది హిందువులుగా గుర్తించారు. [2] ఇతర వనరుల ప్రకారం ఇది 2.3%. [3]
బెలీజ్‌లోని హిందూ సమాజం ఎక్కువగా 1950లలో బెలీజ్ బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో వచ్చింది. సమాజంలో దాదాపు పూర్తిగా అందరూ సింధీలే. దానిలో కొన్ని సాంస్కృతిక భేదాలు ఉన్నాయి.
బెలీజ్ జనాభాలో 3.9% భారతీయులు ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు. దాదాపు 40% మంది ఇప్పటికీ హిందువులు. [4]
బెలీజ్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒకటి బెలీజ్ నగరం లోను, రెండవది కొరోజల్ లోనూ (సుఖ్ శాంతి ఆలయం) ఉన్నాయి. [5] దీపావళి, [6] జన్మాష్టమి [7] వంటి పండుగలను హిందువులు ఈ ఆలయాల్లో జరుపుకుంటారు.