ప్రసాద్ వర్మ | |||
బేణి ప్రసాద్ వర్మ
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2016 జులై 5 – 2020 మార్చి 27 | |||
ముందు | కిషోర్ | ||
---|---|---|---|
తరువాత | జైప్రకాష్ | ||
నియోజకవర్గం | ఉత్తరప్రదేశ్ | ||
పదవీ కాలం 2011 జనవరి 19 – 2014 మే 26 | |||
ముందు | వీరభద్ర సింగ్ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమర్ | ||
పార్లమెంట్ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | కీర్తి వర్ధన్ సింగ్ | ||
తరువాత | కీర్తి వర్ధన్ సింగ్ | ||
నియోజకవర్గం | గొండా లోక్‌సభ నియోజకవర్గ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉత్తరప్రదేశ్, , భారతదేశం | 1941 ఫిబ్రవరి 11||
మరణం | 2020 మార్చి 27 లక్నో, ఉత్తరప్రదేశ్ , భారతదేశం | (వయసు 79)||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాలితీదేవి | ||
సంతానం | 3 కొడుకులు 2 కూతుళ్లు | ||
మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=509 |
బేణి ప్రసాద్ వర్మ ( 1941 ఫిబ్రవరి 11 - 2020 మార్చి 27) భారతీయ రాజకీయ నాయకుడు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.[1] సమాజ్‌వాదీ పార్టీకి చెందిన, ప్రసాద్ వర్మ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు. 2016లో ప్రసాద్ వర్మ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
ప్రసాద్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో కుర్మీ కుటుంబంలో జన్మించాడు.[2][3] ప్రసాద్ వర్మకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం.[1][4]
ప్రసాద్ వర్మ భారత ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.
1996 నుంచి 1998 వరకు ప్రసాద్ వర్మ దేవెగౌడ మంత్రివర్గంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.
ప్రసాద్ వర్మ 1998, 1999 2004లో కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు ఎన్నికయ్యాడు. 2009లోప్రసాద్ వర్మ కాంగ్రెస్ పార్టీలో చేరాడు., 2009 పార్లమెంటు ఎన్నికల్లో ప్రసాద్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. జూలై-12-2011న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉక్కు మంత్రిగా నియమితులయ్యారు. 2016లో ప్రసాద్ వర్మ తన సొంత పార్టీ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.[5][6]
ప్రసాద్ వర్మ బదోసరాయ్ సమీపంలోని చౌదరి చరణ్ సింగ్ మహావిద్యాలయాన్ని నడుపుతున్నారు. తన సొంత జిల్లా బారాబంకిలో మోహన్‌లాల్ వర్మ విద్యా సంస్థను స్థాపించారు.[7]
ప్రసాద్ వర్మ 2020 మార్చి 27న మరణించారు.[1] ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేశవ్ ప్రసాద్ మౌర్య, అఖిలేష్ యాదవ్ ఇతర రాజకీయ నాయకులు ప్రసాద్ వర్మ మృతి పట్ల సంతాపం తెలిపారు .[8][9][10]
1997లో, ప్రసాద్ వర్మ లక్నో ర్యాలీలో బి.ఆర్ అంబేద్కర్‌ను విమర్శించారు, "అంబేద్కర్ గాంధీజీని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు." [11][12]
2009 డిసెంబరులో లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రసాద్ వర్మ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని "దద్దమ్మగా అభివర్ణించాడు. ప్రసాద్ వర్మ వాజ్పేయితోపాటు ఎల్‌కే అద్వానీపై కూడా వర్మ విమర్శలు చేశారు.[13] దీంతో బీజేపీ నేతలు ప్రసాద్ వర్మ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీని అవమానించారంటు నినాదాలు చేస్తూ పార్లమెంట్‌ను బహిష్కరించారు., క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రసాద్ వర్మ క్షమాపణ చెప్పే వరకు లోక్‌సభను బహిష్కరిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు ప్రసాద్ వర్మ నిరాకరించారు.[14]
2012 ఫిబ్రవరిలో, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో, ముస్లింల కోటా పెంచుతామని చెబుతూ వర్మ తనను అరెస్ట్ చేయమని ECకి ధైర్యం చెప్పాడు.[15] కైమ్‌గంజ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమక్షంలో జరిగిన ర్యాలీలో వర్మ మాట్లాడారు .