బొల్లారం | |
---|---|
Coordinates: 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
విస్తీర్ణం | |
• Total | 8.36 కి.మీ2 (3.23 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 19,385 |
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (6,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 010 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
బొల్లారం, తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉన్న ప్రాంతం. ఇది హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉంది. సికింద్రాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ బొల్లారం ఉంది. 2018లో బొల్లారం పురపాలక సంఘంగా మార్చబడింది.[2]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ ప్రాంతంలో 34,667 (58% మంది పురుషులు, 42% మంది స్త్రీలు) జనాభా ఉంది. ఇందులో 15% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 58% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువగా ఉంది. ఇందులో పురుషలు అక్షరాస్యత 68% కాగా, స్త్రీల అక్షరాస్యత 43%గా ఉంది.
ఇక్కడ, భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి నిలయం ఉంది. ఈ బొల్లారం ప్రాంతం నుండే సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజాం రజాకర్లపై పోలీసు చర్యను ప్రారంభించాడు. హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని పురాతన దేవాలయాలలో ఒకటైన అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ బాగా పేరొందింది. ఇక్కడ ఒక పబ్లిక్ గార్డెన్ ఉంది. సైనిక వస్తువులను రవాణా చేయడానికి బ్రిటిష్ వారు బొల్లారం రైల్వే స్టేషనును నిర్మించారు.
బ్రిటిష్ రాజ కుటుంబ సభ్యురాలు విక్టోరియా రాణి 1847లో యూరోపియన్ శైలిలో నిర్మించిన హోలీ ట్రినిటీ చర్చి ఈ ప్రాంతంలో ఉంది. 1980వ దశకంలో క్వీన్ ఎలిజబెత్ II తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా బొల్లారం సందర్శనలో భాగంగా చర్చికి వచ్చింది.[4] లకాద్వాలా క్రాస్‌రోడ్స్‌కు దగ్గరగా బొల్లారం గ్రంథాలయం ఉంది. లెఫ్ట్ కొలోనెల్ కిర్క్‌వుడ్ అనే వ్యక్తి 1892, జూలై 23న గ్రంథాలయాన్ని ప్రారంభించారు.[5]
రైలుమార్గం: ఇక్కడ బొల్లారం బజార్ రైల్వే స్టేషను ఉంది. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వేస్టేషను, ఫలక్‌నామా రైల్వే స్టేషను, హైదరాబాదు దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషను మొదలైన రైల్వే స్టేషన్లకు కలుపబడి ఉంది.
రోడ్డుమార్గం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బొల్లారం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
వాయుమార్గం: ఇక్కడికి 2 కి.మీ.ల దూరంలో బేగంపేట విమానాశ్రయం, 51 కి.మీ.ల దూరంలోని శంషాబాదులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.