బ్రజ్ కుమార్ నెహ్రూ | |
---|---|
![]() 1961లో బ్రజ్ కుమార్ నెహ్రూ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీని కలిసిన దశ్యం, వైట్ హౌస్ | |
గుజరాత్ గవర్నర్ | |
In office 1984 ఏప్రిల్ 26 – 1986 ఫిబ్రవరి 26 | |
ముఖ్యమంత్రి | మాధవ్ సింగ్ సోలంకి |
అంతకు ముందు వారు | కె.ఎం. చాందీ |
తరువాత వారు | ఆర్. కె. త్రివేది |
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ | |
In office 1981 ఫిబ్రవరి 22 – 1984 ఏప్రిల్ 26 | |
ముఖ్యమంత్రి | షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా |
అంతకు ముందు వారు | లక్ష్మీకాంత్ ఝా |
తరువాత వారు | జగ్మోహన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అలహాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా, ఔధ్, బ్రిటిష్ ఇండియా | 1909 సెప్టెంబరు 4
మరణం | 31 అక్టోబరు 2001 కసౌలి, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | (aged 92)
జీవిత భాగస్వామి | శోభ నెహ్రూ (m.1935} |
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం |
సంతానం | అశోక్ నెహ్రూ, ఆదిత్య నెహ్రూ, అనిల్ నెహ్రూ |
కళాశాల | అలహాబాద్ విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ |
బ్రజ్ కుమార్ నెహ్రూ MBE, ICS (1909 సెప్టెంబరు 4 - 2001 అక్టోబరు 31) ఒక భారతీయ దౌత్యవేత్త, యునైటెడ్ స్టేట్సుకు భారత రాయబారిగా పనిచేసాడు.[1] అతను బ్రిజ్‌లాల్ నెహ్రూ, రామేశ్వరి నెహ్రూ దంపతుల కుమారుడు, భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ బంధువు.
బ్రజ్ కుమార్ నెహ్రూ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ అలహాబాద్ లో జన్మించాడు, ఆయన బ్రిజ్‌లాల్ నెహ్రూ, రామేశ్వరి నెహ్రూల కుమారుడు. ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలలో చదువుకున్నాడు. వివిధ రంగాలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను పంజాబ్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని ప్రదానం చేసింది.[2] ఆయన తాత పండిట్ నందలాల్ నెహ్రూ, పండిట్ మోతీలాల్ నెహ్రూ పెద్ద సోదరుడు.[3] ఆయన భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి బంధువు. 1935లో, ఆయన మాగ్డోల్నా ఫ్రైడ్మన్ (ఫోరి నెహ్రూ)ని వివాహం చేసుకున్నాడు.[4] వివాహం తరువాత, ఆమె తన పేరును శోభా నెహ్రూగా మార్చుకుంది.[5]
1934లో ఇండియన్ సివిల్ సర్వీస్ చేరి, భారతదేశంలోని ఏడు వేర్వేరు రాష్ట్రాలకు గవర్నర్ గా ఎదిగాడు. 1934 నుండి 1937 వరకు పంజాబ్ ప్రావిన్స్ లో వివిధ ప్రభుత్వ పదవులను నిర్వహించాడు. 1957లో ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అయ్యాడు.[6] అతను 1958లో ఎకనామిక్ అఫైర్స్ (బాహ్య ఆర్థిక సంబంధాలు) కోసం కమిషనర్ జనరల్ గా నియమించబడ్డాడు. ఆయన జమ్మూ కాశ్మీర్, అస్సాం, గుజరాత్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర లకు గవర్నర్ గా పనిచేసాడు.[7] ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో ఇందిరా గాంధీకి సహాయం చేయడానికి నిరాకరించిన తరువాత ఆయనను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా రాత్రికి రాత్రే గుజరాత్ కు బదిలీ చేసారు.[8]
ఆయన ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసాడు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసాడు.[9] 1958లో ఎయిడ్ ఇండియా క్లబ్ ఏర్పాటు చేయడానికి ఆయన సహాయం చేసాడు, ఇది భారతదేశ అభివృద్ధికి 2 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్న దాత దేశాల కన్సార్టియం.[10] అతను దౌత్యవేత్తగా, అనేక దేశాలకు రాయబారిగా కూడా పనిచేశాడు, 1951లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవిని ప్రతిపాదించబడ్డాడు, కానీ నిరాకరించాడు. ఆయన 1973 నుండి 1977 వరకు లండన్ లో భారత హైకమిషనర్ కూడా పనిచేసాడు.[10] 14 సంవత్సరాలు ఐక్యరాజ్యసమితి పెట్టుబడి కమిటీకి ఛైర్మన్ గా ఆయన వ్యవహరించాడు.[11] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన నష్టపరిహారాల సమావేశంలో బ్రిటన్ తో జరిగిన 'స్టెర్లింగ్ బ్యాలెన్స్' చర్చలలో ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[12]
బ్రజ్ కుమార్ నెహ్రు నైస్ గైస్ ఫినిష్ సెకండ్ అనే పేరుతో ఒక ఆత్మకథ రాసాడు.[13] ఆయన కోసం 35 సంవత్సరాలు పనిచేసిన శ్రీ రమేష్ కుమార్ సక్సేనా ఆయన జీవిత చరిత్ర రాయడానికి సహాయపడ్డాడు.
1945 నూతన సంవత్సర గౌరవాలలో ఆయన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (ఎంబీఈ)గా నియమితులయ్యాడు.[14] 1999లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును అందించింది.[15]
1999 అక్టోబరు 15న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఇచ్చిన "సివిల్ సర్వీస్ ఇన్ ట్రాన్సిషన్" ప్రసంగం బలమైన పౌర సేవ అవసరాన్ని, పాత్రను వివరిస్తుంది. ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థ, పౌర సేవలలో ప్రబలంగా ఉన్న అవినీతికి కారణాలను కూడా వివరిస్తుంది.
బ్రజ్ కుమార్ నెహ్రు 2001 అక్టోబరు 31న తన 92వ ఏట భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలిలో మరణించాడు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలో దహనం చేశారు, పవిత్ర గ్రంథాల నుండి మంత్రాల పఠనల మధ్య స్మారక సేవ జరిగింది.[16]