బ్రహ్మ సరోవర్ | |
---|---|
ప్రదేశం | థానేసర్, హర్యానా |
అక్షాంశ,రేఖాంశాలు | 29°58′N 76°50′E / 29.96°N 76.83°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట వెడల్పు | 1,800 అ. (550 మీ.) |
గరిష్ట లోతు | 45 అ. (14 మీ.) |
బ్రహ్మ సరోవర్ ఉత్తర భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని థానేసర్‌లో గల హిందువులకు పవిత్రమైన పురాతన నీటి కొలను. కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన అనేక వంశ వృక్షాల జాబితాలను ఈ ప్రాంతం లో ఉంచబడ్డాయి.[1]
ఈ సరోవర్ లోపల శివుడి పవిత్ర మందిరం ఉంది. దీనిని ఒక చిన్న వంతెన ద్వారా చేరుకోవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం, ఈ సరోవర్‌లో స్నానం చేయడం వల్ల 'అశ్వమేధ యజ్ఞం' చేసినంత పవిత్రత వస్తుంది. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో, డిసెంబర్ ఆరంభంలో జరిగే గీతా జయంతి వేడుకల సందర్భంగా ఈ కొలనును అనేక మంది సందర్శిస్తారు.[2][3]
సూర్యగ్రహణాల సమయంలో కొలనులు చాలా రద్దీగా ఉంటాయి, సూర్యగ్రహణం సమయంలో కొలనులో స్నానం చేయడం వలన మంచి జరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు. 29 మార్చి 2006 న, ఏర్పడిన సూర్యగ్రహణం వలన ఇక్కడికి ఒక మిలియన్ మంది ప్రజలు వచ్చి స్నానాలు చేశారు. గ్రహణం సంభవించినప్పుడల్లా ఈ ప్రాంతాన్ని వందల వేల మంది సందర్శిస్తారు.[4]