బి. ఎన్. గోస్వామి | |
---|---|
జననం | బ్రిజిందర్ నాథ్ గోస్వామి 1933 ఆగస్టు 15 సర్గోధ, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2023 నవంబరు 17 చండీగఢ్, భారతదేశం | (వయసు 90)
వృత్తి | కళా చరిత్రకారుడు, విమర్శకుడు |
జీవిత భాగస్వామి | కరుణా గోస్వామి |
పిల్లలు | 1 కుమార్తె; 1 కుమారుడు |
తల్లిదండ్రులు | బి. ఎల్. గోస్వామి |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం పద్మభూషణ్ పురస్కారం |
విద్యా నేపథ్యం | |
చదువుకున్న సంస్థలు | పంజాబ్ విశ్వవిద్యాలయం |
పరిశోధక కృషి | |
పనిచేసిన సంస్థలు | పంజాబ్ విశ్వవిద్యాలయం |
బ్రిజేందర్ నాథ్ గోస్వామి (ఆంగ్లం:B. N. Goswamy; 1933 ఆగష్టు 15 - 2023 నవంబరు 17) భారతీయ కళా విమర్శకుడు, విఖ్యాత చిత్రకళ చరిత్రకారుడు. కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్‌ను నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సారాభాయ్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్.[1] పహారీ పెయింటింగ్,[2] ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్[3]పై పాండిత్యానికి ఆయన ప్రసిద్ధి చెందాడు.
ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు శక్తి బర్మన్ జీవితం, రచనలపై మోనోగ్రాఫ్, శక్తి బర్మన్: ఎ ప్రైవేట్ యూనివర్స్,[4], మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్ 1100 -1900, భారతీయ సూక్ష్మ కళపై ఒక గ్రంథం[5] ఇలా ఆయన కళలు, సంస్కృతిలపై 20కి పైగా పుస్తకాలు రచించాడు.[6]
భారత ప్రభుత్వం అతనికి 1998లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది, దానిని 2008లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో అందించింది.[7]
బ్రిజేందర్ నాథ్ గోస్వామి 1933 ఆగస్టు 15న బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) సర్గోధాలో జన్మించాడు.[8]
స్థానికంగా హైస్కూల్ చదువు పూర్తిచేసిన ఆయన అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో తన ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. 1954లో పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి బీహార్ కేడర్‌లో పనిచేశాడు. అయితే, తన చదువును కొనసాగించడానికి 1958లో రాజీనామా చేశాడు.[9]
పంజాబ్ యూనివర్శిటీకి తిరిగి వచ్చిన ఆయన 1961లో పీహెచ్‌డీ పొందేందుకు ప్రఖ్యాత చరిత్రకారుడు హరి రామ్ గుప్తా మార్గదర్శకత్వంలో దిగువ హిమాలయాల కాంగ్రా పెయింటింగ్, దాని సామాజిక నేపథ్యంపై పరిశోధన చేశాడు. అతని ఎగ్జామినర్లుగా ఆర్థర్ లెవెల్లిన్ బషమ్, డబ్ల్యూ.జి. ఆర్చర్ ఉన్నారు.[10]
తన పరిశోధన సమయంలో, అతను పంజాబ్ యూనివర్శిటీలో ఆర్ట్ హిస్టరీ ఫ్యాకల్టీగా చేరాడు. అక్కడే ఆయన ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందాడు. 1973 నుండి 1981 వరకు హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్‌లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఆయన కాలిఫోర్నియా, బర్కిలీ, పెన్సిల్వేనియా, జ్యూరిచ్ వంటి అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[11]
పంజాబ్ విశ్వవిద్యాలయంలో, అతను డైరెక్టర్‌గా మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను అభివృద్ధి చేశాడు.[12] మ్యూజియంలో సమకాలీన భారతీయ కళకు సంబంధించి 1200 క్రియేషన్స్ ఉన్నాయి.[13] ఆయన ప్రొఫెసర్ గానే కాకుండా, భారతీయ సంస్కృతిపై విద్యా కార్యక్రమాలలో పాల్గొనే విద్యావేత్తలకు శిక్షణను అందించే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) వైస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. అతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) పాలక కమిటీ సభ్యుడు. చండీగఢ్ లలిత కళా అకాడమీకి కూడా ఆయన అధ్యక్షత వహించాడు.
ఆయన కరుణ అనే కళా చరిత్రకారిణి, విద్యావేత్త, పంజాబ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ని వివాహం చేసుకున్నాడు.[14] ఈ దంపతులకు ఒక కుమారుడు అపూర్వ, ఒక కుమార్తె మాళవిక ఉన్నారు.
బ్రిజేందర్ నాథ్ గోస్వామిని పదవీ విరమణ తరవాత, పంజాబ్ విశ్వవిద్యాలయం అతన్ని ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా చేసింది.[15] ఆయన 1969 నుండి 1970 వరకు జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్[16], 1994లో సారాభాయ్ ఫెలోషిప్‌లను పొందాడు. అలాగే, ఆయన నార్త్ కరోలినాలోని నేషనల్ హ్యుమానిటీస్ సెంటర్‌లో మెల్లన్ సీనియర్ ఫెలో కూడా.
భారత ప్రభుత్వం అతనికి 1998లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది.[17] 2008లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది.[18]
శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్న 90 ఏళ్ల బ్రిజేందర్ నాథ్ గోస్వామి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- రీసెర్చ్ సంస్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 నవంబరు 17న తుదిశ్వాస విడిచాడు.[19]
ఆయన భార్య కళా చరిత్రకారిణి కరుణా గోస్వామి 2020లో మరణించింది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)