వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1952 నవంబరు 24 | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4 |
1952 నవంబర్ 24 న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన బ్రిజేష్ పటేల్ (Brijesh Patel) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.[1] 1974 నుంచి 1977 మధ్యకాలంలో బ్రిజేష్ భారత టెస్ట్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున ఇతడు 21 టెస్టులు ఆడి 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఇతని అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 10 సార్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 30.37 సగటుతో 243 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 82 పరుగులు. కవర్, పాయింట్ లలో ఇతను అత్యుత్తమ ఫీల్డర్ గా పేరుసంపాదించాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్న భారత జట్టులో బ్రిజేష్ ప్రాతినిధ్యం వహించాడు.