బ్రూనైలోని హిందూ సమాజం దాదాపు మొత్తం భారతీయ సంతతికి చెందిన వారే. వీరు సుమారు కొన్ని వేలమంది ఉంటారు. బ్రూనైలో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం, హిందువులలో 124 మంది పౌరులు కాగా, మరో 91 మంది శాశ్వత నివాసులు. మిగిలిన వారు పౌరులు కాని వారు.
మైనారిటీ జాతి తమిళులు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [1] వీరిలో ప్రధానంగా బ్రూనైలో పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు కాగా మిగతావారు విద్యారంగంలో పనిచేసేవారు. ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు అలాగే పరిశోధనా సిబ్బంది వీరిలో ఉన్నారు. [2]
మైనారిటీ జాతి తమిళులు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [3] వీరిలో ప్రధానంగా బ్రూనైలో పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు కాగా మిగతావారు విద్యారంగంలో పనిచేసేవారు. ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు అలాగే పరిశోధనా సిబ్బంది వీరిలో ఉన్నారు. [4]
బ్రూనైలోని బెలైట్‌లోని సెరియాలో నేపాల్ సంఘం ఉంది. ఇది బ్రిటీష్ ఆర్మీకి చెందిన బ్రిగేడ్ ఆఫ్ గూర్ఖాస్ సభ్యుల సమాజం. చారిత్రికంగా, వారు బ్రూనై స్వయంప్రతిపత్తిని సాధించడంలో దోహదపడ్డారు [5] [6]
బ్రూనై హిందూ వెల్ఫేర్ బోర్డ్ సుమారు 3,000 మంది సభ్యులు కలిగిన 50 సంవత్సరాల పురాతన హిందూ మత సంస్థ. దేశంలో రెండు చిన్న హిందూ దేవాలయాలు ఉన్నాయి. [7] [8]
దేశంలో రెండు హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ, బ్రూనై ప్రభుత్వంలో అధికారికంగా ఒకటి మాత్రమే నమోదైంది. [9] ఈ ఆలయం బ్రూనైలోని సెరియాలోని గూర్ఖా రెజిమెంట్ల భూభాగంలో ఉంది. ఈ హిందూ దేవాలయాన్ని స్థానిక హిందూ, బౌద్ధ సంఘాలు ప్రార్థన కోసం సందర్శిస్తారు. [10] [11]