వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రూస్ అడ్రియన్ ఎడ్గర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 23 November 1956 వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | (age 68)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బూట్సీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 143) | 1978 27 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1986 21 August - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 30) | 1986 17 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1986 18 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1976/77–1989/90 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 16 December |
బ్రూస్ అడ్రియన్ ఎడ్గర్ (జననం 1956, నవంబరు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్ ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించాడు.
1981లో, వన్డే ఇన్నింగ్స్‌లో 99 పరుగులతో నాటౌట్ అయిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు.[1][2]
ఎడ్గర్ 1956, నవంబరు 23న న్యూజీలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌లో పుట్టి పెరిగాడు. ఇతని తండ్రి, ఆర్థర్, కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎడ్గర్ రొంగోటై కళాశాలలో చదువుకున్నాడు. అక్కడ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. వెల్లింగ్టన్, తరువాత న్యూజీలాండ్ రెండింటికీ ఓపెనింగ్ చేశాడు.[3]
ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లలో తోటి లెఫ్ట్ హ్యాండర్ జాన్ రైట్‌తో కలిసి విజయవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు.[4][5]
సిడ్నీలోని గోర్డాన్ గ్రేడ్ క్రికెట్ క్లబ్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. 2010-11 సీజన్‌లో ఎడబ్ల్యూ గ్రీన్‌షీల్డ్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. క్లబ్ నిర్వహణలో ముఖ్య పాత్రను పోషించాడు.
2013 ఆగస్టులో, న్యూజీలాండ్ క్రికెట్‌లో జనరల్ మేనేజర్ నేషనల్ సెలెక్షన్‌లో పార్ట్-టైమ్ పదవిని చేపట్టేందుకు ఎడ్గర్ తన స్వదేశానికి తిరిగి వచ్చాడు.[6] ఎడ్గార్ 2015 మే లో తన పదవికి రాజీనామా చేశాడు. మరుసటి నెలలో, జేమీ సిడాన్స్ స్థానంలో ఎడ్గర్ మూడు సంవత్సరాల ఒప్పందంపై వెల్లింగ్టన్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[7]