బ్రోచేవారెవరురా | |
---|---|
దర్శకత్వం | వివేక్ ఆత్రేయ |
రచన | వివేక్ ఆత్రేయ |
నిర్మాత | విజయ్ కుమార్ మన్యం |
తారాగణం | శ్రీ విష్ణు నివేదా థామస్ నివేదా పేతురాజ్ సత్యదేవ్ కంచరాన ప్రియదర్శి పుల్లికొండ రాహుల్ రామకృష్ణ |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | రవితేజ గిరిజల |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | మన్యం ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 28 జూన్ 2019 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బ్రోచేవారెవరురా 2019లో విడుదలైన భారతీయ తెలుగు క్రైమ్ కామెడీ చలనచిత్రం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా,మన్యమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మన్యం విజయ్ కుమార్ నిర్మించాడు. శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజు, సత్యదేవ్ కాంచరనలు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియదర్శి పుల్లికొండ, రాహుల్ రామకృష్ణ సహాయ పాత్రలు పోషించారు.[1] వివేక్ సాగర్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్.
విశాల్ చిత్ర పరిశ్రమలో తానేంటో నిరూపించుకోవడం కోసం షాలిని అనే కథానాయికను కలిసి కథ వినిపించడానికి వెళతాడు. ఆ కథలో ముగ్గురు రాహుల్, రాకీ, రాంబో ఇంటర్మీడియట్ పాసవలేక చాలా సంవత్సరాల నుంచీ ఒకే కళాశాలలో చదువుతూ అధ్యాపకులచేత చీవాట్లు తింటూ ఉంటారు. ఇంతలో ఆ కళాశాల ప్రిన్సిపల్ కూతురు మిత్ర కూడా అక్కడికే వచ్చి చేరుతుంది. ఆమె కూడా చదువులో సున్నాయే కావడంతో వీరి ముగ్గురితో పరిచయం ఏర్పడుతుంది. మిత్రకు చదువు రాకపోయినా నాట్యం అంటే ఇష్టం. కానీ ఆమె తండ్రి మాత్రం ఆమె బాగా చదువుకోవాలని పట్టుబడుతుంటాడు. దానికోసం ట్యూషన్లకు కూడా పంపిస్తుంటాడు.
ఈ చిత్రాన్ని 2018 ఆగష్టులో శ్రీ విష్ణు కథానాయకుడిగా అధికారికంగా ప్రారంభించారు. తరువాత, నివేతా థామస్ ని ఈ ప్రాజెక్టులో భాగమని ధృవీకరించారు.2018 డిసెంబర్ 30న, తారాగణం సభ్యులందరితో అధికారిక టైటిల్ లోగోను సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ చిత్రం 2019 మార్చి ప్రారంభంలో షూటింగ్‌ను ముగించి 2019 జూన్ 28 న విడుదలయ్యింది.[2][3]
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర సంగీతాన్ని ఆదిత్య ముజిక్ ద్వారా విడుదల చేశారు.[4]