భక్షక్ | |
---|---|
దర్శకత్వం | పుల్‌కిత్ |
రచన | జ్యోత్సన నాథ్ పుల్‌కిత్ |
నిర్మాత |
|
తారాగణం | భూమి ఫెడ్నేకర్ సంజయ్ మిశ్రా ఆదిత్య శ్రీవాస్తవ సాయి తమంకర్ |
ఛాయాగ్రహణం | కుమార్ సౌరభ్ |
కూర్పు | జుబిన్ షేక్ |
సంగీతం | పాటలు: అనురాగ్ సైకియా అనుజ్ గార్గ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: క్లింటన్ సెరెజో బియాంకా గోమ్స్ |
నిర్మాణ సంస్థ | రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2024 |
సినిమా నిడివి | 135 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
భక్షక్ 2024లో హిందీలో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో షెల్టర్ హోమ్ రేప్ కేసు ఆధారంగా[2] రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో గౌరీ ఖాన్, గౌరవ్ నిర్మించిన ఈ సినిమాకు పుల్‌కిత్ దర్శకత్వం వహించాడు. భూమి ఫెడ్నేకర్, సంజయ్ మిశ్రా, సాయి తమంకర్, ఆదిత్య శ్రీవాత్సవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 31న విడుదల చేసి[3], సినిమాను ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[4]
పాట్నాలోని మునావర్‌పూర్‌లో వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు వరుసగా అత్యాచారానికి గురవుతుంటారు. బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) అనాథ బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తూ ఈ మాఫియాను నిర్వహిస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోశిష్ న్యూస్ ఛానెల్‌ను నడుపుతున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్తు వైశాలి (భూమి పడ్నేకర్) వాటిని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. బన్సీలాల్ కు రాజకీయ నాయకులతో ఉన్న సత్సంబంధాల కారణంగా దానిపై చర్యలు తీసుకోడానికి ఎవరూ సాహసించరు. ఈ నేపథ్యంలో వైశాలి ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదురుకుంది. ఆధారాలతో సహా వాటిని ఎలా వెలుగులోకి తెచ్చింది? బాలికలను రక్షించి బన్సీలాల్ కు శిక్షపడేలా చేసిందా లేదా? అనేదే మిగతా సినిమా కథ.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)