భగవంత్ కేసరి | |
---|---|
![]() | |
దర్శకత్వం | అనిల్ రావిపూడి |
రచన | అనిల్ రావిపూడి |
నిర్మాత | సాహు గారపాటి హరీష్ పెద్ది |
తారాగణం | నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ అర్జున్ రాంపాల్ శ్రీలీల |
ఛాయాగ్రహణం | రామ్ ప్రసాద్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | ఎస్.ఎస్. థమన్ |
నిర్మాణ సంస్థ | షైన్ స్క్రీన్స్ |
విడుదల తేదీ | 19 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భగవంత్ కేసరి 2023లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.[1] నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[2] ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా సందర్బంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలై, నవంబర్ 23 నుండి ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
భగవంత్ కేసరి విడుదలైన ఆరు రోజుల్లోనే 104 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు వంద కోట్ల పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.[4]
వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భగవంత్ కేసరి (బాలకృష్ణ). ఆ జైలర్ శ్రీకాంత్ (శరత్‌కుమార్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఆ జైలర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా జైలు అధికారికి కూతురు విజ్జి పాప (శ్రీలీల) ను ఆర్మీ ఆఫీసర్ చేయాలనే తన కోరికను భగవంత్ కేసరికి చెబుతాడు. విజ్జీని చంపేందుకు బిజినెస్‌మెన్ రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ప్రయత్నిస్తుంటాడు? విజ్జీని అతడు ఎందుకు చంపాలని అనుకున్నాడు? భగవంత్ కేసరి రాహుల్ సంఘ్వీ నుండి విజ్జుని ఎలా కాపాడాడు? విజ్జుని సైన్యంలోకి పంపాలన్న భగవంత్ కేసరి లక్ష్యం నెరవేరిందా? అడ్డంకులను దాటి భగవంత్ కేసరి ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయగలిగాడా? అనేదే మిగతా సినిమా కథ.[9][10]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఉయ్యాలో ఉయ్యాలో" | అనంత్ శ్రీరామ్ | ఎస్. పి. చరణ్ | 4:15 |
2. | "గణేష్ అంథెం" | కాసర్ల శ్యామ్ | కరీముల్లా, మనీషా పంద్రకి | 4:38 |
3. | "మాను మాకు" | అనంత శ్రీరామ్ | కీర్తన శ్రీనివాస్ | |
4. | "రోర్ ఆఫ్ కేసరి" | కాసర్ల శ్యామ్ | కోరస్ | 3:20 |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)