భగవతి చరణ్ వోహ్రా | |
---|---|
జననం | లోహోర్, పంజాబ్ ప్రావిన్సీ, బ్రిటిష్ ఇండియా | 1903 నవంబరు 15
మరణం | 28 మే 1930 లోహోర్, పంజాబ్ ప్రావిన్సీ, బ్రిటిష్ ఇండియా | (aged 26)
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నౌజావాన్ భారత్ సభ | |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమం |
జీవిత భాగస్వామి | దుర్గా భాభీ |
పిల్లలు | సచ్ఛీంద్ర వోహ్రా |
భగవతి చరణ్ వోహ్రా (1903 నవంబరు15 - 1930 మే 28 ) హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్న ఒక భారతీయ మార్క్సిస్ట్ విప్లవకారుడు. అతను సిద్ధాంతకర్త, నిర్వాహకుడు, వక్త, ప్రచారకుడు.
1921 లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి వోహ్రా కళాశాల విద్యను విడిచిపెట్టాడు. ఉద్యమం పూర్తయిన తర్వాత అతను లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరాడు, అక్కడ అతను బి.ఏ డిగ్రీ పొందాడు. అక్కడే అతను విప్లవాత్మక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అతను భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌తో కలిసి రష్యన్ సోషలిస్ట్ విప్లవం నమూనాపై స్టడీ సర్కిల్ ప్రారంభించాడు.
వోహ్రా పఠనాశక్తి గలవాడు. అతను పనిచేసిన సంస్థల పనితీరు మూలాల్లో మేధో భావజాలాన్ని ప్రేరేపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను కుల దురభిప్రాయాల ద్వారా ప్రభావితం కాలేదు. హిందూ-ముస్లిం ఐక్యతతో పాటు సోషలిస్టు సూత్రాలను ఉపయోగించి పేదవారి అభ్యున్నతికి కృషి చేశాడు.
1926 లో అతని స్నేహితుడు స్థాపించిన నౌజవాన్ భారత్ సభ విప్లవ సంస్థలో ప్రచార కార్యదర్శిగా పనిచేసాడు. [1] 1928 ఏప్రిల్ 6 న, వోహ్రా, భగత్ సింగ్ లు నౌజవాన్ భారత సభ యొక్క మ్యానిఫెస్టోను తయారు చేశారు. స్వాతంత్ర్య లక్ష్యాన్ని సాధించడానికి ఏకైక మార్గదర్శిగా "సేవ, బాధ, త్యాగం" అనే ట్రిపుల్ నినాదాన్ని కలిగి ఉండాలని యువ భారతీయులను కోరారు.
1928 సెప్టెంబరు లో, చాలా మంది యువ విప్లవకారులు ఢిల్లీ లోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో సమావేశమయ్యారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా పునర్వ్యవస్థీకరించారు. వోహ్రా ప్రచార కార్యదర్శిగా నియమితుడయ్యాడు. కాంగ్రెస్ లాహోర్ సెషన్ సమయంలో విస్తృతంగా పంపిణీ చేయబడిన హెచ్.ఎస్.అర్.ఏ మ్యానిఫెస్టోను సిద్ధం చేసింది. [2] జెపి సాండర్స్ హత్య, సెంట్రల్ అసెంబ్లీ హాల్‌లో సింగ్, బటుకేశ్వర్ దత్ బాంబులు విసిరిన ఉదంఆలలో కూడా అతను భాగస్వామి.
1929 లో అతను లాహోర్‌లోని కాశ్మీర్ బిల్డింగ్ లో రూమ్ నంబర్ 69 ను అద్దెకు తీసుకున్నాడు. దానిని బాంబ్ ఫ్యాక్టరీగా ఉపయోగించాడు. అతను ఢిల్లీ-ఆగ్రా రైల్వే లైన్‌లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ రైలు కింద 1929 డిసెంబరు 23 న బాంబు పేలుడు కోసం పథకం తయారు చేసి అమలు చేశాడు. ఈ సంఘటనలో వైస్రాయ్ గాయపడకుండా తప్పించుకున్నాడు. మహాత్మా గాంధీ తన కల్ట్ ఆఫ్ బాంబ్ అనే ఆర్టికల్ ద్వారా ఈ విప్లవాత్మక చర్యను ఖండిస్తూ, తృటిలో వైస్రాయ్ తప్పించుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
వోహ్రా 1930 మే 28న లాహోర్ [3] లోని రావి నది ఒడ్డున ఒక బాంబు పరీక్ష సమయంలో మరణించాడు. లాహోర్ కుట్ర కేసులో విచారణలో ఉన్న సింగ్, ఇతరులను రక్షించడానికి అవసరమైన పరికరం తయారుచేసి దాని పరీక్షా సమాంలో పేలిపోయినందున తీవ్రంగ గాయపడ్డాడు.
అతనికి భార్య దుర్గావతి దేవి (విప్లవకారులకు దుర్గాభాభీగా సుపరితితురాలు), ఒక కుమారుడు సచింద్ర వోహ్రా ఉన్నారు.